క్షణాల్లో బ్రేకింగ్ న్యూస్ లు.. అరచేతిలో న్యూస్ యాప్స్.. ఈ డిజిటల్ యుగం మొత్తం ఫోర్త్ స్టేట్ స్వరూప స్వభావాలనే సమూలంగా మార్చేసింది. ఒకప్పుడు ప్రపంచాన్నేలిన ప్రింట్ మీడియా ఈరోజు ఒక్కొక్కటిగా రూపాంతరం చెందుతూ వస్తుంది. కోట్లాది సర్కులేషన్లతో సంచలనం సృష్టించిన న్యూస్ పేపర్స్ ఈరోజు లక్షలకు.. ఇంకా చెప్పాలంటే వేలకు పరిమితం అయిపోయాయి. కనుమరుగవుతున్న పాఠకులను దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాలు ప్రింట్ మీడియా మనగడను ప్రశ్నార్థకం చేసేలా సాగుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న పత్రిక రంగం. ఆహా(AHA) ట్వీట్ తో ఉలిక్కి పడింది. ”పొద్దున్నే ఒక చేతిలో కాఫీ.. మరో చేతిలో పేపర్ ఆహా ఈ ఊహ ఎంతో బాగుంది కదా” అంటూ ‘ఆహా’ దినపత్రిక రాబోతుందంటూ ఒక ట్వీట్ వదిలారు. రామోజీరావు వంటి దిగ్గజపత్రికాధిపతి కొన్ని పత్రికల ప్రింట్ ఆపేసి డిజిటల్ వైపు వచ్చి మరికొన్ని పత్రిక సర్కులేషన్ (ప్రింటింగ్ వాల్యూ) తగ్గించుకుని ముందుకు వెళుతున్న తరుణంలో ఆహా దినపత్రిక ప్రకటన నిజంగానే కాక రేపింది. అయితే ఇది ఏప్రిల్ ఫూల్ వార్త లేక నిజంగా ‘ఆహా’ దినపత్రిక వస్తుందా..? అన్నది పెద్ద కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. నిజానికి ఆహా సంస్థను నిర్వహిస్తున్న అర్హ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ లో మేజర్ వాటా కలిగి ఉన్న మై హోమ్ రామేశ్వరావు దే టీవీ9 అన్న విషయం అందరికీ తెలిసిందే దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ కలిగి ఉన్న అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (ఎబిసిఎల్) కు న్యూస్ పేపర్ నిర్వహణ పెద్ద కష్ట సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికే ఈ టీవీకి ఈనాడు , ఎబిఎన్ కు ఆంధ్రజ్యోతి, టీ న్యూస్ కి నమస్తే తెలంగాణ, వి6కి వెలుగు, వంటి ప్రధాన దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ గా నడుపుతున్నారు అయితే ఇవి కూడా క్లిష్ట పరిస్థితుల్లోనే నడుపుతున్నారు. సోషల్ మీడియా విస్తృతి విస్తరించిన తర్వాత పాఠకుడికైనా, ప్రేక్షకుడికైనా ఇన్ డెప్త్ విషయం అవసరం లేకుండా పోయింది. షార్ట్ కట్ న్యూ షాప్స్ చాలామంది మొబైల్ లో ఇన్స్టాల్ అయి ఉండడంతో న్యూస్ అంటే అదే అన్న పరిస్థితికి జనం వచ్చేసారు. మార్కెట్లోకి ఏడు రూపాయలకు అందిస్తున్న ఈనాడు లాంటి దినపత్రిక ఒక ప్రింట్ కోసం దాదాపు 40 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. పాఠకుడికి అంత తక్కువ రేటుకి పత్రిక అందించాలంటే కచ్చితంగా వ్యాపార ప్రకటనల మీద ఆధారపడాలి.ఏడ్వార్టైజ్మెంట్ రంగం కూడా ప్రింట్ కన్నా సోషల్ మీడియా బెటర్ అనే నిర్ణయానికి రావడంతో ప్రింట్ మీడియా తీవ్ర సంక్షేపాన్ని ఎదుర్కొంటుందన్నది వాస్తవం. ఇక జనసేన వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించడం ఖాయం అన్న సమయంలో ఇప్పటికే ఒక ఎలక్ట్రానిక్ మీడియా చేతిలో ఉన్న తమ పార్టీకి సొంత ప్రింట్ మీడియా కూడా ఉంటే మరింత ఉపయోగం అన్న తరుణంలోనే ఆహా దినపత్రికను తీసుకొస్తున్నారన్న అంశం కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంది. తెలంగాణ ఆంధ్రాలో బిజెపికి, జనసేనకి ఆహా బాసటగా ఉండబోతుంది అన్నది నడుస్తున్న టాక్. చిరంజీవి ఫ్యామిలీలో అంతంత మాత్రమే సంబంధాలు ఉన్నాయని అల్లు అరవింద్ పై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆహా దినపత్రిక పై మళ్లీ అనుమానాలు ముసరుతున్నాయి ఆహా నిజమైతే మళ్లీ ప్రింట్ మీడియాలో కొత్త ఊహలు మొదలైనట్టే.