నా పెళ్లి గురించి వస్తున్నవన్నీ పుకార్లే …నటి అంజలి

కొంత కాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని ప్రముఖ నటి అంజలి స్పష్టం చేశారు.. పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉందని చెప్పారు.మే 31వ తేదీన విడుదల కాబోతున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన అంజలి ఈ వ్యాఖ్యలు చేశారు.. అలాగే ఈ సినిమా లోని రత్నమాల పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను. పాత్రను మలిచిన తీరు చాలా బాగుంటుంది. ఈ తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. అలాంటి రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించడం నాకు నచ్చదు. ఈ పాత్రలోని వైవిధ్యమే నన్ను ఈ సినిమా చేయడానికి అంగీకరించేలా చేసింది. ఇందులో మా పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. నా ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది సినిమాలో విశ్వక్ ఎంత గట్టిగా మాట్లాడతారో.. అంతకంటే గట్టిగా నేను మాట్లాడతాను. ట్రైలర్ లో గమనిస్తే మీకు ఆ విషయం అర్థమైపోతుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లేదా ఫలానా పాత్ర అని కాకుండా.. అన్ని పాత్రలు బలంగా, కథలో కీలకంగా ఉంటాయి. నాది సినిమాలో కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనేది నా సినిమా, నేను ప్రధాన పాత్ర పోషించిన సినిమా. అలాగే ‘గేమ్ చేంజర్’ చిత్రంలో కూడా నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర అని చెప్పారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More