కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి బాద్‌షా కిచ్చా సుదీప్ ‘మాక్స్’ టీజర్‌ను ను విడుదల చేశారు. యాక్షన్ జానర్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ మాక్స్ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మాక్స్ పాన్-ఇండియన్ సినిమాగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాక్స్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కిచ్చా సుదీప్ చాలా కాలం తరువాత మళ్లీ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌లో అతని డెమి-గాడ్ లుక్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది. మాస్, యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకునేలా సినిమాను తీయబోతోన్నారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి తదతరులు నటించారు. అజనీష్ లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందించారు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై కిచ్చా సుదీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు.