అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ‘శ్వాగ్’ ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. గ్లింప్స్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సింగరో సింగ, సెకండ్ సింగిల్- గువ్వ గూటి, థర్డ్ సింగిల్ ఇంగ్లాండు రాణి సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ నాస్టాల్జిక్ మెలోడీ ‘నీలో నాలో’ సాంగ్ ని రిలీజ్ చేశారు. వివేక్ సాగర్ ఈ సాంగ్ ని సోల్ ఫుల్, నాస్టాల్జిక్ మెలోడీగా స్కోర్ చేశారు. భువన చంద్ర మీనింగ్ ఫుల్ అండ్ క్యాచి లిరిక్స్ తో సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్య మెస్మరైజింగ్ వోకల్స్ తో పాడిన ఈ సాంగ్ సెటప్, కాస్ట్యూమ్స్, కంపోజిషన్‌తో ఆడియన్స్ ని 80, 90s లలోకి తీసుకెళ్ళింది. పాటలో లీడ్ పెయిర్ శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ కెమిస్ట్రీ ని బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేసింది.
రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్, నందు మాస్టర్ స్టంట్స్ నిర్వహిస్తున్నారు.