రేవ్ పార్టీలకు వెళ్లే వ్య‌క్తి ని కాదంటున్న నటుడు శ్రీకాంత్

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వ‌హించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తానస‌లు ఆ పార్టీకే వెళ్ల‌ల‌దేని తెలుగు సినీ న‌టుడు శ్రీకాంత్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచే ప్ర‌త్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో నాకు సంబంధించిన వార్త‌ల‌ను వారు రాయ‌లేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం. మొన్న‌మో నా భార్య‌తో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అన్నారు. వార్త‌లు రాసిన వాళ్లు తొంద‌ర ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్య‌క్తిని కాను నేను. ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొంత సేపు అక్క‌డి ఉండి వ‌చ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నానని వివరణ ఇచ్చారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More