ఫోర్ కె రీ రిలీజ్ లతో రీ సౌండ్ చేస్తున్న బ్లాక్ బస్టర్స్

టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంది ఈరోజు అందుబాటులో ఉన్న సాంకేతికత రేపటికి ఔటేటెడ్ గా మారిపోతున్న స్పీడ్ డేస్ ఇవి ఒకప్పటి ఎపిక్ ఎవర్ గ్రీన్ మూవీ మాయాబజార్ ను కలర్ లో డిజిటల్ ప్రొజెక్షన్ లో చూసి ఎంటర్టైన్ అయిన ప్రేక్షకులకు తెలుగు సినిమా అలాంటి వినోదాలు విందునే తిరిగి అందించేందుకు సిద్ధం అయింది.. ఫిల్మ్ (రీల్) నుంచి డిజిటల్ చిప్స్ వైపు అడుగు వేసిన సినిమా అప్పటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఇప్పుడు 4కె రీ రిలీజ్ లతో అదరగొట్టేస్తుంది మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి ఈ మధ్యనే 4కె రిలీజ్ అయి మళ్ళీ ఫ్యాన్స్ ని కట్టిపడేసింది. ‘ఎప్పుడొచ్చాం అన్నది కాదు బుల్లెట్ దిగిందా.. లేదా’ అన్నట్టుగా అత్యధిక సెంటర్లో పోకిరి రిలీజ్ అయి కోటిన్నరకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రీరిలీజ్ లో కూడా కలెక్షన్ కురిపించిన సినిమాలు చాలానే ఉన్నప్పటికీ ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టడం విశేషమే మరి. మాయాబజార్ దానవీరశూరకర్ణ లాంటి చిత్రాలు అప్పట్లో ఎన్నిసార్లు రిలీజ్ అయినా జనాలు నీరాజనాలు పట్టేవారు. అయితే ఆ కాలంలో సినిమా చూడటానికి థియేటర్ మినహా మిగిలిన మరి ఏ ప్లాట్ ఫామ్ లేకపోవడంతో ఇది సాధ్యమైంది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు విడుదలవుతున్న చిత్రాలు ప్రేక్షకుడికి వేరే మాద్యమాలలో అందుబాటులో ఉన్నప్పటికీ, టీవీలలో రిపీట్ టెలికాస్ట్లతో అలరిస్తున్నప్పటికీ కూడా థియేటర్లో మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం ఆ ఫిలిమ్స్ పై ఆ అభిమానులకు ఉన్న క్రేజీకి నిదర్శనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని రిలీజ్ చేసిన జల్సా ప్రపంచ వ్యాప్తంగా 3.20 కోట్ల వసూలు చేయగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి2.57 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది 710 కి పైగా షో లతో ఈ కలెక్షన్ సాధించడం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇది ఎపిక్ రికార్డు అని బ్లాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు చేసిన రచ్చ కూడా రికార్డులు ఎక్కింది చాలా ధియేటర్లో తెరలు చింపి నిప్పు పెట్టి సీట్లను కోసి నానా బీభత్సం సృష్టించి రద్దు చేశారు తాటిపాక విశాఖపట్నంలో అంటే కొన్ని ఏ ఆర్టీసీలో తాటిపాక ,విశాఖపట్నం లాంటి కొన్ని ప్రాంతాల్లోని థియేటర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఇలాంటి సంఘటనలు మినహాయిస్తే అన్నిచోట్ల రీసౌండ్ బ్యాండ్ భజయించింది ఈ చిత్రాల ఇన్స్పిరేషన్తో మరిన్ని ఫోర్ కే చిత్రాలు రానున్నాయి ఈ చిత్రాల ఇన్స్పిరేషన్తో మరిన్ని మరికొన్ని చిత్రాలు ఫోర్కేతో అలరించడానికి సిద్ధమవుతున్నాయి అప్పటి సంచలనం ఫస్ట్ సెవెంటీ అని చిత్రమైన సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన సింహాసనం చిత్రం కూడా 8కె హెచ్డీ హంగులను అద్దుకొని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు అదేవిధంగా చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను కూడా 4కె వెర్షన్ వస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు ఎలాగైతేనే పాత చిత్రాలని కొత్త టెక్నిక్ తో మళ్ళీ తెరపైకి రావడం ఆనందాయకం ఆహ్వానించదగ్గ పరిణామం.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More