చాలాకాలం గ్యాప్ తరువాత అల్లు శిరీష్ చిత్రం టీజర్ ఎట్టకేలకు సెప్టెంబర్ 29న ఆడియన్స్ ని పలకరించనుంది.. గత మే లో శిరీష్ బర్త్ డే సందర్భంగా ‘ప్రేమకాదంటా’ పేరుతో టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు టైటిల్ మార్చేసి టీజర్ ని విడుదల చేయనున్నారు.. ‘ఊర్వశివో.. ప్రేయసివో..’ అంటూ మరో రొమాంటిక్ పేరు నీ ఫిక్స్ చేసేశారు.. అను ఇమ్మానియెల్ తో అల్లు శిరీష్ రొమాంటిక్ పోశ్చర్ తో టీజర్ ప్రకటన పోస్టర్ వచ్చింది. గత కొంతకాలంగా హైదరాబాదుకు, ఫ్యామిలీకి దూరంగా బాంబేలో ఉంటున్నాడని ఫ్యామిలీ లో కూడా ఉన్నాయని వచ్చిన గాసిప్స్ కి ముగ్గురు అన్నదమ్ములు తండ్రి అల్లు అరవింద్ తో కలిసి తాతకు నివాళులర్పించిన ఫోటో సమాధానంగా నిలిచింది.. వెనువెంటనే టీజర్ ఎనౌన్స్మెంట్ కూడా రావడం తో అవన్నీ వండి వార్చిన కధనాలే అని తేలిపోయింది.. జీఎ టూ, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో విజేత, జతకలిసే, చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అల్లు శిరీష్ తొలిసారి సిక్స్ ప్యాక్ కనిపించనున్నాడు. ఉన్నాడు అచ్చు రాజమణి (గతం లో అనూప్ రూబెన్స్ పేరు కూడా వుండేది) సంగీతాన్ని అందిస్తున్న ఈ పేరు మార్చుకున్న చిత్రం ఎంత మేరకు మెప్పిస్తుందోచూడాలి మరి..