పుష్ప మ్యానియా ఇంకా తగ్గలేదుగా..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ మ్యానియా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టర్, డైలాగ్స్, డాన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. పార్ట్- 2 ఎప్పుడు వస్తుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఆ మూవీలో కీలకపాత్ర చేసిన ఫహద్ ఫాజిల్ పార్ట్ -3 కూడా ఉందని చెప్పడం తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి భారీ వసూళ్లను రాబట్టిన బాహుబలి, కే.జి.ఎఫ్ చిత్రాలు రెండు పార్ట్ లుగా మాత్రమే ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా నార్త్ ఇండియాలో రిలీజ్ అయిన పుష్ప మాత్రం అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి అల్లు అర్జున్ క్రేజీని అమాంతంగా పెంచేసింది. అతనితో డైరెక్ట్ గా బాలీవుడ్ లో మూవీలు చేసేందుకు అక్కడి దర్శక, నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. అతనికి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు టాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి కంటెంట్ తో, తన కెరీర్ లోనే ఇప్పటివరకు చేయునటువంటి క్యారెక్టర్ తో పుష్ప మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అద్భుత నటనతో అందరి హృదయాలను ట్రిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టి ఫ్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్ బాహుబలి, కేజీఎఫ్ ఈ రెండు చిత్రాల నుంచి వచ్చే మూడో పార్ట్ కోసం ఆ చిత్ర దర్శక -నిర్మాతలు కూడా ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే వారికి ఉన్న తదుపరిచిత్రాల కమిట్మెంట్స్ తో పార్ట్ -3 ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికి పుష్ప మూవీ మాత్రం పార్ట్-3 ఉంటుందని అందులో నటించిన ఫహాద్ ఫాజిల్ ద్రువీకరించడంతో సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ నుంచి వచ్చే పుష్ప పార్ట్ 2, పార్టు 3 ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది చివర్లో పార్ట్-2 షూటింగ్ ప్రారంభమై వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ చిత్రాలన్నీ హిందీలో డబ్ అయి యూట్యూబ్ ఛానల్స్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తూ అతని క్రేజ్ ను అమాంతంగా పెంచి అతని స్టామినా ఏంటో రుజువు చేసాయి. ఈ చిత్రాలు అతనిని నార్త్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేశాయి.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More