ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ షూటింగ్‌లలో బిజీ బిజీ గా వున్నారు.. త్రివిక్రమ్ , హరీష్ శంకర్ ల దర్శకత్వంలో బ్యాక్ టూ బ్యాక్ యాడ్స్ చేస్తున్నాడు పుష్ప2షూటింగ్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న అల్లు వారబ్బాయి యాడ్ కోసం మేకప్ వేసుకున్నాడు. ఇటీవలే కుటుంబంతో వెకేషన్ పూర్తి చేసుకుని కమర్షియల్స్ పై పడ్డాడు.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాడ్ బ్యాంకాక్‌లో ఆస్ట్రల్ పైప్స్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో యాడ్ షూటింగ్‌కి హాజరయ్యారు . అల్లు అర్జున్ న్యూ లుక్ అధిరిపోవడం తో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పుష్ప 2 చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే కమర్షియల్ యాడ్స్ ను కంప్లీట్ చేసుకుంటున్నాడు ఈ ఐకాన్ స్టార్.