ఆ ఆలయంలోని శివలింగం యుగాంతాన్ని సూచించేది అని అందరూ చెబుతుంటారు.కొంతమంది చరిత్రకారులు దీనిని కొట్టిపారేస్తున్నప్పటికీ మరి కొందరు మాత్రం దీనిని గట్టిగా నమ్ముతున్నారు. ఆ ఆలయ విశిష్టత గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అది నూటికి నూరు శాతం నిజమని గాఢంగా విశ్వసిస్తారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని ఉన్న అత్యంత పూరితమైన చరిత్ర కలిగిన హరిచంద్ర కోటలో వుండే ఈ ఆలయం ఒక చిన్న గుహలో వుండే ఐదు అడుగుల శివలింగమే యుగాంతాన్ని శాసిస్తుందని చెప్తున్నారు ఈ శివలింగం ఒక పెద్ద బండరాయి కింద ఉంది. ఆ శివలింగాన్ని ప్రతిష్టించేటప్పుడు ఆ బండరాయి శివలింగం మీద పడకుండా నాలుగు వైపులా నాలుగు స్థంబాలు చెక్కారు. ఈ స్థంబాలు నాలుగు యుగాంతానికి ప్రతీకలు అని అంటారు. ఒక్కొక్క స్థంభం ఒక్కో యుగాంతానికి ప్రతీక అని భక్తుల నమ్మకం. ఇప్పటికే ఈ నాలుగు స్థంబాలలో ఒక్కొక్క యుగానికి ప్రతీకగా ఒక్కో స్థంభం విరిగిపోయాయి. ఇప్పుడు ఒకే ఒక స్థంభం మిగిలివుంది. ఆ స్థంభం కూలిపోయినప్పుడు కలియుగం అంతం అవుతుందని భక్తుల నమ్ముతున్నారు. ఇదో కల్పిత కథ అని దానిని కావాలని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కొంతమంది చెబుతున్నారు. భక్తులు మాత్రం ఈ ఆలయానికి అలాగే అక్కడ ఉండే శివలింగానికి ఉన్న విశిష్టత గురించి గొప్పగా చెబుతున్నారు. ఆలయ ప్రతిష్ట మంటగలిపేలా మాట్లాడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్న కోటను ఎప్పుడు ఎవరు నిర్మించారు అన్నదానికి స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. ఒక్కొక్కరు ఒక్కోలాగా చెబుతున్నాడు. కొంతమంది వాదన ప్రకారం కృతయుగంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు అంటే .. మరికొందరు ఆ హరిచంద్ర కోటని మొదటి సారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు 4 వ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని కట్టి ఉంటారని అంటున్నారు. ఐతే ఈ ఆలయం ఎవరు ఎప్పుడు నిర్మించారనే విషయం మాత్రం కచ్చితంగా ఎవరికీ తెలియదు. ఇకపోతే ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయంలో ఎప్పుడు ఐదు అడుగుల మేర కోనేటిలో చల్లని నీరు ఉంటుంది. ఈ నీరు ఆ కోనేటిలోకి ఆలయ గోడల్లో నుండి వస్తుంది. ఐతే ఈ ఆలయంలో జరిగే వింత ఏమిటి అంటే ఒక్క వర్షా కాలంలో తప్ప ఆ నీరు మిగిలిన అన్ని కాలాల్లో వస్తుంది. అక్కడ వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు కూడా కనిపించదు. ఎండాకాలంలో ఎంత ఎండ ఉన్నా కూడా నీరు చల్లగానే ఉంటాయి. ఈ వింతని చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వారితో పాటు ఎంతోమంది ఇతరదేశాల నుండి కూడా ఇక్కడకు వస్తూ ఉంటారు. శిథిలావస్థలో ఉన్న ఆ కోట గోడలను, ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఆలయాన్ని, అలాగే పురాతన శివలింగాన్ని, బండరాయి శివలింగం పై పడకుండా నిర్మించిన స్తంభాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఒక టూరిజం ప్రదేశం గా విరాజిల్లుతుంది.