టాలీవుడ్- కోలీవుడ్ ల మధ్య చిచ్చుపెట్టిన పొన్నియన్ సెల్వన్

పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజైన మణిరత్నం మూవీ ఇప్పుడు టాలీవుడ్- కోలీవుడ్ అభిమానుల మధ్య చిచ్చు పెడుతుంది. టాలీవుడ్ నుంచి ఈ మూవీకి వస్తున్న నెగిటివ్ రివ్యూలను తమిళ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కావాలనే ఈ సినిమాను ప్లాప్ చేయడానికి తెలుగు లో చేస్తున్న నెగిటివ్ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై తమిళ ఆడియన్స్ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. తమిళ్ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలను కూడా తాము ప్లాప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ముందు ముందు జరగబోయేది అదేనంటూ సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఈ సినిమాపై ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే తమిళ్ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని మరోపక్క తెలుగు ఆడియన్స్ కూడా సమాధానం చెబుతున్నారు. అయితే వాస్తవంగా చూసుకుంటే ఈ సినిమా తొలి రోజున భారీ ఓపెనింగ్స్ వచ్చేయనే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలలో కూడా సుమారుగా తొలి రోజు అన్ని షోస్ కూడా ఫుల్ అయ్యాయి స్టార్ డైరెక్టర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి హేమ హేమీలు కలిసి పనిచేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. 185 రోజులలో 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించారని తెలుస్తుంది. మణిరత్నం సినిమాలు గత కొన్నేళ్లుగా వరుసగా అపజయాలను అందుకుంటున్నాయి. ఈ సినిమా మణిరత్నం తప్పకుండా భారీ హిట్ కొడతాడనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆడియన్స్ అంచనాలను ఈ సినిమా అందుకోలేక పోయిందనే ప్రచారం జరుగుతుంది. సినిమా పూర్తిగా తమిళ్ కథ, దీనికి తోడు ఆర్టిస్టులు చాలామంది ఈ సినిమాకు తమిళ్ వాళ్లే పని చేశారు. పూర్తిగా ఇది తమిళ్ సినిమా. పాన్ ఇండియన్ సినిమా కాదనే మరోపక్క కొందరు ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో చివరి వరకు హీరో ఎవరో, విలన్ ఎవరో తెలియని గందరగోళ పరిస్థితి ఉందని ఆడియన్స్ చెపుతున్నారు. దీనికి తోడు యాక్షన్ సన్నివేశాలు కూడా అంత ఆసక్తికరంగా లేవని పెదవిరుస్తున్నారు. ఇటువంటి సినిమాలకు యాక్షన్ సన్నివేశాలు కీలకం. కానీ ఆ సన్నివేశాలను సరిగా తీర్చిదిద్దలేదని అంటున్నారు. సినిమా మొత్తం కార్తి మీదే ఉంటుంది. ఇందులో ప్రధాన హీరోలు విక్రమ్, జయం రవి అయినప్పటికీ కార్తికే ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చినట్లు ఆడియన్స్ చెబుతున్నారు. సినిమా కథ చాలావరకు సరిగా అర్థం కావడం లేదని చాలామంది చెప్తుండగా మరో బాహుబలి అంటూ తమిళ్ ఆడియన్స్ ఈ సినిమాని భారీ ఎత్తున ప్రచారం చేశారు.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా అని, బాహుబలి ఈ సినిమా దరిదాపుల్లోకి రాదంటూ చాలా ఘాటుగానే సోషల్ మీడియాలో తమిళ ఆడియన్స్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక మొదటి రోజే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనిపై టాలీవుడ్ లో చేస్తున్న ట్రోలింగ్ పై తమిళ్ ఆడియన్స్ మండిపడుతున్నారు. మూవీని విమర్శిస్తూ తెలుగు వెబ్‌సైట్స్ కూడా రివ్యూస్ రాశాయి. ఈ రివ్యూస్‌తో ఓ కోలీవుడ్ సినీ క్రిటిక్ బాగా హర్ట్ అయి తెలుగు సినిమాలను ప్లాప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. కోలీవుడ్‌కు చెందినఓ యుట్యూబర్, సినీ క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి ‘పొన్నియిన్ సెల్వన్’ కు వచ్చిన నెగెటివ్ రివ్యూస్ చూసి ట్విట్టర్‌లో ఘాటుగా స్పందిస్తూ ‘‘తమిళనాడులో తెలుగు సినిమాలు నడిస్తే మాకు ఎటువంటి సమస్య లేదు. కానీ, తమిళ సినిమాను కావాలని నడవకుండా చేస్తే మీ చిత్రాలకు అదే గతి పట్టిస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. కానీ, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే ఇతర భాషలకు చెందిన నటులు పలు సందర్భాల్లో తెలుగు చిత్ర పరిశ్రమపై, ప్రేక్షకులపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో రోహిత్ శెట్టి, కార్తి, సూర్య, యశ్ తదితరులంతా టాలీవుడ్ ఇండస్ట్రీని మెచ్చుకున్నారు. ముఖ్యంగా కార్తి నటించిన ‘యుగానికి ఒక్కడు’ తెలుగులో సంచలన విజయం సాధించింది. కోలీవుడ్‌లో ప్లాఫ్ అయింది. తెలుగులో తనకు లభించినంత ప్రేమ కోలీవుడ్‌లో లభించలేదని కార్తి ఓ అవార్డ్స్ ఫంక్షన్స్‌లో స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తమిళ్ లో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఓవరాల్ గా అన్ని భాషల కలెక్షన్ లు కలిపి మూడో రోజుకి వంద కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటుతుందని క్రిటిక్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పై మాత్రం టాలీవుడ్ – కోలీవుడ్ ఆడియన్స్ మధ్య ఒక చిన్న పాటి వార్ సోషల్ మీడియా వేదికగా కొనసాగడం విచారకరం.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More