నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టినరోజును మెగాస్టార్ చిరంజీవి జరిపి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు చిరంజీవి సమక్షంలో కేక్ కట్ చేయించి పుట్టినరోజు జరిపారు. గత కొంతకాలంగా వయోభారం రీత్యా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న కైకాల సత్యనారాయణ గారికి మెగాస్టార్ చిరంజీవి దైర్యం చెపుతూ త్వరలోనే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారని మా అందరి మధ్యకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విచ్చేసి ఒక సీనియర్ నటుడి పట్ల చూపించిన గౌరవానికి కైకాల సత్యనారాయణ కుటుంబీకులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కైకాల సత్యనారాయణ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటివి వీరి సినిమాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి.