గత కొంతకాలంగా శృతి హాసన్ ఆరోగ్యం పై వస్తున్న పుకార్లకు చెక్ చెప్తూ షూటింగ్ లో పాల్గొన్న ఫోటో తో ఫేక్ యూ ట్యూబర్లు, కంగుతిన్నారు. ఆమె చాలాకాలంగా లేవలేని స్థితిలో ఆసుపత్రి లో చికిత్స పొందుతుందని పీసీఓడీ, పీఐఓఎస్ లాంటి సమస్యలతో ఆరోగ్యం ఏమాత్రం సహకరించలేనటువంటి స్థితి లో ఉందని వ్యూస్ కోసం ప్రాకులాడే కొన్ని యుట్యూబ్ చానల్స్, మరికొన్ని వెబ్సైట్ లు వార్తలు వండి వార్చారు వాటన్నింటికి చెక్ చెప్తూ కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర జరుగుతున్న షూటింగ్ లో శ్రుతి హసన్ సందడి చేశారు. బాలక్రిష్ణ హీరోగా మైత్రి మూవీస్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ గత 6 రోజులనుంచి కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఒక ప్రముఖుడి శవయాత్రకి సంబందించిన సీన్ షూట్ ఇక్కడ జరుగుతుండగా బాలయ్య బాబు, శ్రుతి హసన్ లను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు