టాలీవుడ్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ కార్తికేయ – 2. ఈ మూవీ కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ మూవీ 13 తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. అయినప్పటికీ తమకు మంచి డేట్ దొరికిందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిన సరే విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది. టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా ఈ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. బాలీవుడ్ నుంచి ఏదైనా మూవీ విడుదల అవుతూ ఉందంటే దానికోసం పెద్దగా ఎక్కడ చర్చే ఉండటం లేదు. అదే టాలీవుడ్ మూవీ అయితే మాత్రం చాలా ఆసక్తిగా దానికోసం ఎదురు చూస్తూ ఉండటం జరుగుతుంది. దేశ సమైక్యత కోసం, భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాలను, హిందూయిజాన్ని, కుటుంబ విలువలను హైలెట్ చేస్తూ వరుసగా వస్తున్న టాలీవుడ్ మూవీలకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ ఆడియన్స్ మాత్రమే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక లో కూడా టాలీవుడ్ మూవీలకు మంచి డిమాండ్ ఉంది. రాజమౌళి బాహుబలి మూవీతో ప్రారంభమైన టాలీవుడ్ పాన్ ఇండియా ప్రస్థానం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. బాహుబలి స్ఫూర్తితో కన్నడ, మలయాళ, తమిల్, హిందీ సినిమాలు కూడా పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కానీ టాలీవుడ్ మూవీలకు వస్తున్న ఆదరణ అయితే లేదు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే పాన్ ఇండియన్ మూవీ అంటే ఒక టాలీవుడ్ మూవీలు మాత్రమేనని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, మేజర్ మూవీల తర్వాత ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తో పాటు నిఖిల్ కార్తికేయ – 2 కూడా ఉంది. ఈ మూవీ ఈనెల 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. తెలుగులో కంటే నార్త్ స్టేట్స్ లోనే ఈ మూవీ పట్ల మంచి బజ్ క్రియేట్ అయింది. కార్తికేయ మొదటి భాగం విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ మూవీ కూడా మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్తికేయ – 2 మొదటి భాగానికి మించి ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ చేసింది. ద్వారక నగరం కోసం అలాగే శ్రీకృష్ణుని కోసం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ను ఈ మూవీలో చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. హిందువులు దైవ సంభూతులుగా ఆరాధించే శ్రీకృష్ణుని కోసం ఈ మూవీ చేస్తున్నట్లు తెలిసి నార్త్ ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్ మూవీలు రొటీన్ కథలతో భారతీయతను, కుటుంబ విలువలను చెడగొడుతున్నారని ఆగ్రహం అక్కడ వారిలోఎక్కువగా ఉంది. అందుకే బాలీవుడ్ లో సినిమాలను నార్త్ ఆడియన్స్ బాయ్ కాట్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ మూవీలను నెత్తిన పెట్టుకుంటున్నారు. కార్తికేయ – 2 కోసం ఇప్పుడు నార్త్ ఇండియన్ లో ఎక్కడ చూసినా పెద్ద చర్చే జరుగుతుంది. ఆ మూవీ ని తప్పకుండా అందరూ చూడాలని హిందూ వాదులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విడుదలైన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని తెలుస్తుంది. ఈ మూవీ టాక్ బాగుంటే మాత్రం తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమా కోసం ఇక్కడ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి షో తోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.