Vaisaakhi – Pakka Infotainment

అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది..?

“అలిపిరి” అసలు ఈ పేరుకి అర్ధం ఏంటి..? ఈ పేరు పుట్టుక వెనుక కధ ఏంటి..? వాడుక లోకి ఎలా వచ్చింది.. అత్యంత పవిత్రమైన దివ్య క్షేత్రానికి తొలిగడప ఈ అలిపిరి విచిత్రంగా అనిపించిన ఈ పేరు కు అర్ధం తెలుగుతో పాటు ఏ భాష లోను లేదు. మరి అర్థమే లేని ఈ పదం ఎలా పుట్టింది … ? దీని వెనుక ప్రచారంలో ఉన్న కధ ఏంటి..? వాస్తవం ఎంత..? ఓ ఐదు శతాబ్దాల క్రితం అంటే దాదాపు 1656 – 1668 మధ్య ప్రాంతం లో తళ్ళికోట యుద్ధానంతరం విజయనగరసామ్రాజ్య పతనం అంచుల్లో ఉన్న సమయంలో రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించిన నిజాం నవాబు హిందువులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించేవాడు. ఆ దాడుల్లో భాగంగా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా – కుతుబ్ షా , వజీర్ల సైన్యం, ” ఆలీ ” అన్న సైనికాధికారి నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను పాశవికంగా ధ్వంసం చేసిన అనంతరం ఆలీ సైన్యం తిరుపతికి చేరుకుంది. తిరుమల ఆలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే ఈ హిందు దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ ” అల్లా ” యే గొప్ప దేవుడని భావించి, ” ఇస్లాం ” మతాన్ని గత్యంతరం లేక స్వీకరిస్తారని ఆలోచన మొదటిది కాగా శ్రీ కృష్ణ దేవరాయలు వంటి ప్రభువులు, చక్రవర్తులు, ఇతర రాజులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న వజ్ర, వైఢూర్యాలు, స్వర్ణాభరణాలను ఎత్తుకెళ్దామన్నది రెండవ దురాలోచన. శ్రీవారి ఆలయంపైకి దాడి చేసే దురుద్ధేశం తో అక్కడకు వచ్చిన ఆలీ ” ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని ఉద్దేశించి తిరుపతి పౌరులంతా నీక్కావలసింది బంగారమే అయితే మావద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం. వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి మాత్రం రాకు అని గ్రామస్తులంతా కలిసి చేసిన విజ్ఞప్తి కి అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారుఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ , ఢిల్లీ సుల్తాను ఇద్దరు కలిసి నా తల తీసేస్తారు అంటూ ముందుకు కదిలాడు. ఇప్పుడు ” అలిపిరి ” అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీవారు వరాహ రూపంలో వచ్చి సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తే మొదట కొంచెం బెదిరినప్పటికి దానిని లెక్కచేయకుండా ముందుకు కదిలాడు. హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయట.. దిక్కులేని స్థితిలో ఎంతో విలపించిన అలీ కి దైవం పైనే దాడికి సిద్ధపడటానికి ఎంత ధైర్యం … ? అన్న శ్రీ స్వామి వారి ” అమృత వాణి వినిపించింది.. అంతే బిగ్గరగా రోదిస్తూ … క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్న ఆలీ మోర విన్న స్వామి క్షణమాలస్యం చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి కలుగుతుందని సెలవిచ్చారు దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు “ఆలీ”. ఉర్దూ లేక హిందీ భాషలో ” ఫిర్ నా ” అంటే వెనక్కి మళ్ళడం, ” ఫిరే ‘ అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ ముందుకెళ్లలేక వెనుదిరిగాడు ” ఆలీ ఫిరే “, “ఆలీ ఫిరే” అని సూచిస్తూ … చాటింపులు సైతం వేయించారు. ” ఆలీ ” ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారట.ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేవారిని ఎవరైనా అడిగినప్పుడు ” అలీ ఫిరే” కు వెళ్లినట్లు గా చెప్పడం పరిపాటి అయింది. కాలక్రమేణ ఆలీ ఫిరే అనే పదం ఆలి పిరే గా రూపాంతరం చెంది అలిపిరి గా స్థిరపడింది. దాడికి ప్రయత్నం చేసిన ముష్కర మూక ఎక్కడైతే తోకముడిచి పారిపోయిందో అక్కడ నుంచే శ్రీవారి భక్తి పాదయాత్ర మొదలయి గోవింద నామ స్మరణతో అక్కడి గిరులన్ని ఈరోజు మారుమ్రోగిపోతున్నాయి.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More