అన్ స్టాపబుల్ స్టార్ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అతి పెద్ద విజయం సాధించిన అఖండ మూవీ హిందీ వెర్షన్ ఈనెల 20 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఆర్ఆర్‌ఆర్ మూవీని హిందీలో రిలీజ్ చేసిన పెన్ మూవీసే ఈ అఖండను కూడా నార్త్‌లో రిలీజ్ చేయబోతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో నార్త్ బెల్ట్ లో రిలీజ్ కాబోతోంది. 2021లో రిలీజయి బాక్సాఫీస్ వద్ద రూ. 85 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో తెలుగు సినిమాగా నిలిచి బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో ఇప్పుడు మరోసారి తాండవం చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. ఈసారి బాలీవుడ్‌లో అఖండ ఆగమనం ఖాయమైంది. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలయ్య పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. బోయపాటి మాస్ అంశాలను దైవత్వానికి జోడించి, ఈ సబ్జెక్ట్‌ను మలిచిన తీరు అందరికీ నచ్చింది. ముఖ్యంగా థమన్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. అఖండ చిత్రాన్ని బాలీవుడ్‌లో జనవరి 20న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఇక ఈ క్రమంలోనే అఖండ హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సౌత్ నుంచి మాస్ మూవీస్‌కు నార్త్‌లో మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అఖండకు కూడా అలాంటి ఆదరణే లభిస్తుందని మేకర్స్ ఆశతో ఉన్నారు. మరి బాలయ్య తన నటవిశ్వరూపంతో చేసిన తాండవానికి బాలీవుడ్ జనాలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
previous post
next post