ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వ్యతిరేకంగా హాలీవుడ్ సమ్మె సైరన్ పూరించింది. నెల రోజుల క్రితం హాలీవుడ్ లోని రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు సపోర్ట్ గా హాలీవుడ్ యాక్టర్స్ కు సంబంధించిన స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (SAG) కూడా ఇప్పుడు సమ్మెకు దిగింది. కొన్ని నిర్మాణ సంస్థలు కథల కోసం AI దగ్గరకు వెళ్తుండటం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కధలు ఏపిసోడ్స్ ని క్రియేట్ చేసుకోవడం తో పాటు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు వస్తున్నా తమకు మాత్రం కనీస వేతనం ఇవ్వకపోవడం వంటి పలు అంశాలతో సమ్మెకు దిగారు. దాదాపు నెలరోజులు నుంచి ఈ సమ్మె సాగుతుండగా సడెన్ గా హాలీవుడ్ నటులు కూడా సమ్మెకు దిగడం తో సమస్య పెద్దయింది. రైటర్స్ సమ్మెకు దిగినప్పుడు నిర్మాణ సంస్థల యూనియన్ అయిన అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ ( AMPTP )తో మాట్లాడి తమ డిమాండ్స్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సమ్మె కు కూడా AMPTP రెస్పాన్డ్ కాకపోవడంతో 80 శాతం మంది హాలీవుడ్ నటీనటులు సమ్మెలోకి దిగారు.రైటర్స్ ఏవైతే కోర్కెలతో సమ్మె కు దిగారో.. అవే డిమాండ్స్ సాధనను యాక్టర్స్ కూడా కోరుకుంటున్నారు. సినిమా నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్రని తగ్గించాలని హాలీవుడ్ గొంతెత్తింది.. ఈ మేరకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డిశ్చర్ ప్రెస్ మీట్ పెట్టి రైటర్స్ గిల్డ్ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా తాము కూడా ప్రత్యక్ష కార్యాచరణ లోకి దిగానున్నట్టు ప్రకటించారు. ఈ సమ్మెతో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు, ఓటీటీ , టీవీ సంస్థలు తలలు పట్టుకున్నాయి.త్వరలో సమ్మె విరమణ కాకపోతే టెలికాస్ట్ కు కంటెంట్ కొరత వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సమ్మె విరమించకపోతే హాలీవుడ్ మూతపడే అవకాశాలను త్రోసిపుచ్చడం లేదు.. సమ్మె జరుగుసమయంలో హాలీవుడ్ నటులు అప్పటికే నటించి విడుదలకు సిద్ధమైన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడానికి వీల్లేదని గిల్డ్ ప్రకటించడంతో పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల పబ్లిసిటీ పై కూడా సమ్మె ఎఫెక్ట్ పడనుంది..
previous post
next post