2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాలలో 13.90 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న బిజెపి కొన్ని నెలల వ్యవధి లోనే 35.08 శాతానికి ఎగబాకి అధికార కాంగ్రెస్ కి ధీటుగా ఎనిమిది లోక్ సభ సీట్లు సాధించి మంచి జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉప ఎన్నికలపై కన్నేసింది.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఉప ఎన్నికలపై బిజేపి ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ కు దారి తీసింది.. సంపూర్ణ మెజార్టీ తో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ లోకి సహజం గానే కొంతమంది బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జంప్ చేసారు.. దానిపై ఆ పార్టీ నేతలు స్పీకర్ కు పిర్యాదు చేసారు.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులు గా ప్రకటించాలని కోరారు.. ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరే జారిపోతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అలెర్ట్ అయింది.. తెలంగాణ లో అధికారం కోల్పోవడం ఒక దెబ్బ అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కకపోవడం తో బీఆరెస్ శ్రేణులు పూర్తి గా ఢీలా పడిపోయారు.. ఈ పార్టీ లో వుంటే మనుగడ కష్టం అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరే సమయం చూసుకుంటూ చెక్కేస్తున్నారు.. అధినేత ఎంత వారించినా ఉపయోగం సున్నా.. దీన్నే బిజేపి అవకాశం గా తీసుకుని ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినప్పటికి వర్కౌట్ కాకపోవడం తో ఇప్పుడు ఉప ఎన్నికల పైనే గంపెడాశ పెట్టుకుంది.. పార్టీ మారిన అందరిపైనా కాకపోయినా కొంత మంది పైనేనా అనర్హత వేయించాలని బిజేపి భావిస్తోంది. బీఆరేస్ కన్నా బిజేపి కే ఆత్రుత ఎక్కువైంది.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బిజేపి పోటాపోటీగా చెరో ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి. కచ్చితంగా 10 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బిజెపి ఎనిమిది సీట్లలో విజయం సాధించింది.. పద్నాలుగు సీట్లు తమకే వస్తాయని మొదట్నుంచీ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైంది . బిజేపి కి దాదాపు అన్ని స్థానాలలో బీఆర్ఎస్ బేషరతు గా మద్దతు ప్రకటించి బిజేపి కి సాయపడిందని కాంగ్రెస్ నేతలు బహిరంగం గానే విమర్శించారు.. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పై ఉప ఎన్నికల విషయంపై బీఆరెఎస్ కన్నా బిజేపి యే ఎక్కువ వూపు మీదుంది.. పార్లమెంటు ఎన్నికలకు ప్రధాని మోదీ హవాతో పాటు అయోధ్య రామ మందిరం హిందుత్వ ఎజెండా వంటి ఎన్నో అంశాలతో పాటు బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులు బిజేపి కి కలిసొచ్చాయని అదే అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి ఈ ఫార్ములాలు అంతగా వర్కౌట్ అవ్వవని విశ్లేషకులు భావిస్తున్నారు ..తమకు బాగా కలిసి వస్తాయని భావిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ అంతర్గత కసరత్తు మమ్మురం చేసింది. కచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని బలం గా కోరుకుంటోంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పూర్తి ఆధారాలు సమర్పించే పని లో పడింది.. గతంలో బిజేపి ప్రాతినిధ్యం వహించిన ఈ సీటు కి ఉపఎన్నిక వస్తే గెలుపు గ్యారంటీ అని బిజేపి ఫిక్స్ అయింది .. ఈ ధీమాతోనే అప్పుడే అంతర్గత ప్రచారం చేస్తున్నారు పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సెకండరీ గ్రేడ్ నేతలను కూడా ఆ పార్టీ ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.
previous post
next post