ప్రపంచం మెచ్చిన, ఇటీవల దేశ ప్రధాని ప్రశంసలు అందుకున్న అరకు కాఫీ రుచులు ఇకపై గీతం యూనివర్శిటీ నీ సందర్శించే తల్లితండ్రులు, ప్రముఖులకు అందుబాటులోకి రానున్నాయి.. గిరిజన సహకార సంస్థ(GCC) ఆధ్వర్యంలో అరకు కాఫీ విక్రయ కేంద్రాన్ని గీతం అధ్యక్షుడు, విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎమ్.శ్రీభరత్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ గీతం లో కాలు మెాపడం ఆనందం కలిగించిందన్నారు. ఎరువులు ఉపయెాగించకుండా అల్లూరి జిల్లాలో ఆర్గానిక్ కాఫీని సాగుచేస్తున్న గిరిజనులు ఆంధ్రప్రదేశ్ కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు. అరకు కాఫీ ప్రధాన్యతను నరేంద్ర మోథీ ఈ మధ్యనే మనకి బాత్ లో చెప్పడంతో పాటుగా, ప్రతి ఒక్కరు ఒక సారి రుచి చూడాలని చెప్పడం, అందుకు రాష్ట్ర్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహితం మోథీతో కలిసి అరకు కాఫీ తాగేందుకు సిద్దమంటూ చెప్పారని గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వ హాయాంలో ఈ కాఫీని జీసిసిలో ప్రమోట్ చేశామన్నారు. గీతం యూనివర్శీటిలో సైతం దీనిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వీటితో పాటుగా. జీసిసి సహాజ ఉత్ప్తత్తులు కూడ అందుబాటులో ఉంచడాన్ని అభినందించారు.కార్యక్రమంలో జిసిసి మేనేజింగ్ డైరక్టర్ జి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post