భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా … ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది. చిట్టి పొట్టి టైటిల్ , మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, అలాగే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్ లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.
previous post
next post