లేడీ గెటప్ లో పవర్ ఫుల్ లుక్ రిలీజ్
విశ్వక్సేన్, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి నిర్మిస్తున్న తన లేటెస్ట్ మూవీ ‘లైలా’లో మ్యాన్ అండ్ విమన్ గా కనిపించే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడు. విశ్వక్సేన్‌ను లైలాగా మునుపెన్నడూ లేని క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. బ్రేవ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ని అంగీకరించడం మెంటల్ గా ఫిజికల్ గా ఛాలెంజ్ తో కూడుకున్నది. మేకర్స్ లైలా ఐ లుక్‌ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ లైలాగా ఛార్మింగ్ లుక్ తో అదరగొట్టారు. విశ్వక్సేన్‌కి ఇది బ్యూటీఫుల్ మేక్ఓవర్. అతను పర్ఫెక్ట్ గా విమన్ లా కనిపించిన లుక్ అద్భుతంగా ఉంది. ఫిమేల్ గెటప్‌లో విశ్వక్‌లా మరే యాక్టర్ కనిపించనంత బ్యూటీ గా పాత్రకు అద్భుతంగా సూట్ అయ్యాడో ఆ కళ్లను చూస్తే కంప్లీట్ ఫేస్ ని చూసేందుకు ఎక్సయిమెంట్ మరింతగా పెంచింది.
రాఘవేంద్రరావు క్లాప్ తో..
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా, దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, జెమినీ కిరణ్ మేకర్స్‌కి హ్యాండోవర్ చేశారు.
హై ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ సినిమాతో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. లైలా సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.
రిచర్డ్ ప్రసాద్ డీవోపీ కాగా, వాసుదేవ మూర్తి రైటర్. తనిష్క్ బాగ్చి, జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. ‘లైలా’ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.