తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అతిత్వరలో జరగనున్న నేపథ్యంలో భారీ మార్పులు చేర్పులు వుండే అవకాశం వుందని తెలుస్తోంది. సుమారు ఆరుగురు కొత్తగా మంత్రులయ్యే ఛాన్స్ వుంది.. ఇప్పుడు మంత్రులుగా వున్నవారి శాఖలలో కీలక మార్పులు జరగనున్నాయి.. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క కి హోమ్ మంత్రి గా ప్రమోషన్ రానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పంచాయితీ రాజ్ వంటి కీలక శాఖ ను నిర్వహిస్తున్న సీతక్క కు మొదటి విడత లోనే ఈ హోదా దక్కుతుందని అంతా భావించారు.. అయితే అప్పుడు మిస్ అయిన అవకాశం ఇప్పుడు రానుందని తెలుస్తోంది ఆంధ్ర ప్రదేశ్ లో కూడా హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత వుండడం తో ఇక్కడ కూడా మహిళ ను హోం మినిస్టర్ చేస్తే బావుంటుందని యోచన లో అధిష్టానం వుందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే ధోరణి లో వున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అత్యంత సన్నిహిత విధేయురాలు గా వుండే సీతక్క కు ఆ పదవి వస్తే రెండు రాష్ట్రాల సంభందాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు.
నక్సలైటు ఉద్యమం నుంచి…
1997లో నక్సలైట్ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఆ తర్వాత భర్తని పోలీస్ ఎన్కౌంటర్లో పోగొట్టుకుని చిన్న పిల్లని సాకుతూ తర్వాత మళ్ళీ చదువుకుని ఒక లాయర్ అయి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న సీతక్క రాజకీయ శాస్త్రంలో డాక్టరేట్ చేసి డాక్టర్ సీతక్క(ధనసరి అనసూయ అసలు పేరు) అయ్యారు. కోవిడ్ సమయంలో ఆదివాసీలకి ఇబ్బందులు ఎదురైన సమయంలో తానున్నానంటూ ముందుకెళ్ళిన సీతక్క రాజకీయాలలోకి వచ్చి 2004 లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయి, 2009లో శాసనసభ్యురాలిగా ఎన్నికై, 2014లో మళ్లీ ఓడిపోయిన తర్వాత 2017 లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ నుంచి మరలా ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 20 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఎన్నికవ్వగా 15 మంది ప్లేట్ మార్చేస్తే నిక్కచ్చిగా మిగిలిన ఐదుగురిలో సీతక్క కూడ వున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నిసార్లు పిలుపు వచ్చినా వెళ్ళకుండా నిలబడిపోయారు. ప్రత్యర్థి పార్టీల నుంచే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ల పేరిట కొంతమంది ఆమెను ఇబ్బంది కి గురి చేసినప్పటికీ తొణకకుండ నిబ్బరంగా వ్యవహరించిన ఆమె రెండు దశాబ్దాల తరువాత మంత్రి పదవి చేపట్టారు.. విజ్ఞతతో మాట్లాడి తాడిత పీడిత ప్రజానీక మేలు కోరే సీతక్క ను పీ సీ సీ చీఫ్ గా నియమిస్తారని ప్రచారం జరిగినప్పటికీ హోం మినిష్టర్ అయితేనే కరెక్ట్ గా వుంటుందని అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రేపోమాపో విస్తరణ ప్రకటన రానుండడం తో ఆశావహులు డిల్లీ కి క్యూ కట్టారు..