Vaisaakhi – Pakka Infotainment

ఏపీ లో హోదా పోరాటం..

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ హోదా పోరాటం మొదలయ్యింది.. దాదాపు ఐదున్నరేళ్ళ క్రితం ఎన్డీయే నుంచి బయటకొచ్చి ప్రత్యేక హోదా కోసం అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్ష చేస్తే.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా కోసం ఇప్పుడు పోరాటం మొదలుపెట్టారు. ఒకవైపు వూహించని విజయం.. మరోవైపు అంచనాలకు మించి పరాజయం.. కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వైసిపి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ను కోరుకుంటోంది.. శాసనసభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో మంత్రుల తరువాత తనను ప్రమాణ స్వీకారం చేయించడం పై వైసిపి ఫ్లోర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆక్షేపణ తో స్పీకర్ కు లేఖ రాయడం దానిపై విశృత స్థాయి లో చర్చ జరిగింది.. టీడీపీ నేతలు హోదా కోరడం పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. వైసిపి అధికారం లోకి వచ్చిన తొలినాళ్ళలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రసంగాన్ని గుర్తు చేస్తున్నారు.. తాను గేట్లు తెరిస్తే గెలిచిన ఇరవై మూడు మంది లో చాలా మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం గా వున్నారని అదే జరిగితే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష నాయకుడు హోదా వుండదని అసెంబ్లీ సాక్షి గా చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి పి జనార్దన రెడ్డి ప్రతిపక్ష నేతగా కాకుండా కేవలం ఫ్లోర్ లీడర్ గా, అలాగే లోక్ సభ లో రెండవ లార్జెస్ట్ పార్టీ గా వున్న టీడీపీ కి పి ఉపేంద్ర కూడా ఫ్లోర్ లీడర్ గా మాత్రమే వ్యవహరించిన విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు.. ప్రతిపక్ష హోదకి సంబంధించి పది శాతం వుంటేనే హోదా ఇవ్వాలి లేకుంటే లేదు.. అన్న చట్టం ఏమి లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్రెడ్డి న్యాయ నిపుణులనో రాజ్యాంగ నిపుణులనో కనుక్కుని లేఖ రాస్తే బావుంటుంది అని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తూ ఇప్పటికైనా పోయేదేం లేదని వెళ్లి అసెంబ్లీ కెళ్ళి చట్టాలు చూసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. కౌంటర్, ఎన్ కౌంటర్లతో వైసిపి, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది.. జగన్మోహన్ రెడ్డి కి హోదా ఎందుకు రాదో క్లియర్ గా ప్రజలకు వివరించాలని టీడీపీ భావిస్తోంది. తమ నేత కు పార్టీకి ప్రతిపక్ష హోదా రాకపోతే వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి వస్తారా..? రారా…? అన్న చర్చ మొదలైంది.. డైవర్ట్ పాలిటిక్స్ పైనే ఎక్కువ ఆధార పడ్డ వైసిపి ప్రతిపక్ష హోదా విషయంలో మరో డైవర్ట్ రాజకీయం మొదలెట్టిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇది రాష్ట్రాన్ని పూర్తి గా ధ్వంసం చేసిన వైసిపి కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ప్రజలు తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం కూడా ఆ దేశిషన్ కే కట్టుబడి వుంటుందని చెప్తున్నారు.. జగన్మోహన్ రెడ్డి కి 2018తో ప్రతిపక్ష నేత హోదా 2024 జూన్ 4 తో ముఖ్య మంత్రి హోదా శాశ్వతంగా పోయాయని ఇదే విషయం గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.. కొంత మంది అంటున్నట్టుగా ప్రత్యేక హోదా లాగే ప్రతిపక్ష హోదా కూడా ముగిసిన అధ్యాయమేనంటున్నారు..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More