Vaisaakhi – Pakka Infotainment

కేంద్ర మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎంతమంది మంత్రులు..?

కేంద్రం లో కొలువు తీరిన మోదీ సర్కార్ 3.0 ప్రభుత్వం లో కొత్త క్యాబినెట్ కూర్పు పై ఎన్ డీ ఏ కూటమి పెద్ద కసరత్తే చేసింది..కుల సమతుల్యతతో పాటు మారుతున్న ఎన్నికల మేనేజ్మెంట్ కు అనుగుణంగా రాష్ట్రాల, పార్టీల ప్రాతినిధ్యాన్ని కూడా బ్యాలెన్స్ చేసింది..అయితే ఉత్తరప్రదేశ్ పై గట్టిగా ఫోకస్ చేసిన ఆ పార్టీ ఆ రాష్ట్ర కులాలకు క్యాబినెట్‌లో చోటు కల్పించి రాబోయే యూపీ ఎన్నికల టార్గెట్ ని ముందే ఫిక్స్ చేసింది. మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. కొత్త ప్రభుత్వంలో, 300-320 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే యుపిలోని 60-62% కులాల లక్ష్యంగా పెట్టుకున్నారు. గెలుచుకున్న స్థానాలను మంత్రుల ప్రాతినిధ్యాన్ని పోల్చుకుంటే ఇది వ్యూహాత్మక సర్దుబాటు గా కనిపిస్తుంది. 2014లో, బీజేపీదాని మిత్రపక్షాలు యూపీ లో 73 స్థానాలను గెలుచుకకుంటే 18 మంది మంత్రులు కేంద్ర కేబినెట్ లో స్తానం సంపాదించుకున్నారు.. అదేవిధంగా 2019లో ఆ పార్టీకి 64 సీట్లు వస్తే మంత్రుల సంఖ్య 13కి పడిపోయింది. 2024లో 36 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ, యూపీ మంత్రివర్గ ప్రాతినిధ్యం 10కి పెరిగింది, ఇది మంత్రివర్గంలో 28%.అయితే దేశవ్యాప్త పదవుల విషయంలో రాజకీయ సమతౌల్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది.. యూపీ తరువాత అత్యధిక మంత్రి పదవులు పొందిన రాష్ట్రం బీహార్ఇక్కడ నుంచి గెలుపొందిన ఎన్ డీ ఏ అభ్యర్థుల్లో ఎనిమిది మంది అమాత్యులయ్యారు.మహారాష్ట్ర నుంచి ఆరుగురు,మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ ల నుంచి ఐదుగురు చొప్పున గుజరాత్ , కర్ణాటక నుంచి నలుగురు చొప్పున ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హరియాణా ల ముగ్గురేసి చొప్పున మంత్రులయ్యారు. ఇకతెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ,అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులుదక్కగా ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, జమ్మూ కాశ్మీర్ ల నుంచి ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారుఇదిలా ఉండగా ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్‌ పరిధిలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న పీఎంవో కార్యాలయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్‌ పై తొలి సంతకం చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న 9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం విడులైంది. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More