తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశ చూపి భారతీయులను కంబోడియా మాఫియా మోసం చేస్తుంది. సుమారు 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు తరలించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు.ఉద్యోగాల కోసం ఆశపడిన నిరుద్యోగులు అప్పులు చేసి మరీ బ్రోకర్లకి ఇచ్చి వారి ద్వారా కంబోడియా కి చేరుకుంటున్నారు.అక్కడికి వెళ్ళిన తర్వాత కంబోడియా మాఫియా భారతీయులను చైనా కంపెనీలకు అప్పజెప్తున్నారు.గంటల తరబడి ఇక్కడ భారతీయులతో పనిచేయిస్తూ వారికి మాత్రం ఒక్క శాతం మాత్రమే ఆదాయాన్ని ఇస్తున్నారు.దీనికితోడు అందరిని ఒకే గదిలో పెడుతూ వారికి సరిగ్గా ఆహారం కూడా ఇవ్వడం లేదు.వారి వేధింపులు భరించలేక ఒక యువకుడు విశాఖ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ స్కాం మొత్తం వెలుగు చూసింది.సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి.ఇందులో కొందరు బ్రోకర్లను కూడా అరెస్టు చేశారు.వారి ద్వారా కొంత సమాచారం రాబట్టారు.మొత్తానికి 60 మందిని అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకు వచ్చారు.ఇందులో 20 మంది విశాఖకు సంబంధించిన వారు ఉన్నారు. తాజాగా గురువారం నాడు కూడా మరో నెలకి రండి తీసుకువచ్చారు.కాంబోడియాలో చిక్కుకుపోయిన మరి కొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంలో విశాఖ సిపి డాక్టర్ ఏ. రవిశంకర్, జాయింట్ సీపీ ఫకీరప్ప, సైబర్ క్రైమ్ పోలీసులు చాలా కృషి చేశారు. ప్రస్తుతం ఈ కేసుకుసంబంధించి విచారణ కొనసాగుతుంది.
previous post
next post