ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో వెల్లడయ్యాయి.. ప్రభుత్వ ఏర్పాటు కూడా రాలేదు.. ఇంకా మర్యాద పూర్వక కలయిక లు మాత్రమే జరుగుతున్నాయి.. మంత్రుల కూర్పు లేదు.. అధికారుల చేర్పు లేదు.. అప్పుడే వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు మొదలెట్టేసారు.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఎక్స్ వేదిక గా స్పందించారు.. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని వ్యాఖ్యలు చేశారు ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.. ఓ వైపు గత ప్రభుత్వ అరాచకాలు టీడీపీ అనుకూల చానల్స్ లో స్టోరీలు వేస్తుండగా.. వైసీపీ అనుకూల చానల్స్ లో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ప్రసారాలు మొదలయ్యాయి..టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని వైయస్ఆర్ సీపీ శ్రేణులకు ఒక సందేశం బయటకొచ్చింది. పార్టీ కార్యకర్తల కోసం వారికి సహకరించేందుకు ఒక లీగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఎవరికి ఏ ఇబ్బందీ ఉన్నా లీగల్ టీం చూసుకుంటుందని భరోసా గా చెప్తున్నారు. సోషల్ మీడియా కోసం సపరేట్ లీగల్ టీం ను ఏర్పాటు చేశారు .98482 55263 (శ్రీనివాసరెడ్డి కొమ్మాసాని) 98498 83298 (మనోహర్ రెడ్డి మలసానివైసిపి కార్యకర్తల కోసం రెండు రాష్ట్ర వ్యాప్త ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేయగా ప్రతి నియోజకవర్గానికి లీగల్ సపోర్ట్ ఇచ్చే లిస్ట్ ని విడుదల చేసారు
previous post
next post