డిమాండ్ల చిట్టా తో ఢిల్లీ వెళ్లిన బాబు కి అక్కడ ప్రోటోకాల్ తో ఘనస్వాగతం పలికిన దగ్గరనుంచి ఎన్డీఏ సమావేశం వరకు అధిక ప్రాధాన్యత లభించింది. గతంలో మోదీ అపాయింట్మెంట్ కూడా దక్కించుకోలేకపోయిన బాబు మోదీ తర్వాత స్థానంలో కూర్చునిమంతనాలు సాగించారు..ఎన్డీఏ కూటమి కి మరపురాని విజయాన్ని కట్టబెట్టిన చంద్రబాబుతో మోదీ ఉత్సాహంగా మాట్లాడారు ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. మరోవైపు చంద్రబాబు కూర్చోగా బాబు పక్కనే మరో కీలక భాగస్వామ్య పార్టీ నేత నితీష్ కుమార్ కూర్చున్నారు. టీడీపీ, జేడీయూ డిమాండ్స్ కు దాదాపు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.. ఇదిలా ఉండగా కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో ఈ నిర్ణయిం తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్ అందజేశారు.కాగా, ఎన్డీయే కీలక సమావేశం పూర్తికావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు ఎన్డీయే రాష్ట్రపతిని కలుసుకోనున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని ప్రతినిధి బృందం కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందంటూ భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను అందజేయనుంది. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ఈనెల 9న ప్రమాణస్వీకారం చేసేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారంలోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. అయితే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 292 సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 272ను అవలీలగా దాటింది. కాగా, 18వ లోక్‌సభ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ, 17వ లోక్‌సభను రద్దు చేయాల్సిందిగా కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రభుత్వ రాజీనామాను ప్రధాన మోదీ స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు.. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పటుకు అంతా సంసిద్ధమవ్వడం తో టీడీపీ లోకసభ స్పీకర్ తో పాటు మూడు కేబినెట్, రెండు సహాయ మంత్రుల పదవులు కోరిందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.. వీటన్నిటికి మోదీ అంగీకరించారని అంటున్నారు.. ఇదిలా ఉండగా ఈ నెల7 న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మరోసారి ఎన్డీఏ సమావేశం జరగనుండడం తో మళ్ళి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు 7న సమావేశం జరిగిన తరువాత ఆరోజే రాష్ట్రపతి ని కలసి ప్రభుత్వ ఏర్పాటు కి అవకాశం ఇవ్వమని ఎన్డీఏ నేతలు కోరే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆహ్వానం తరువాత నరేంద్ర మోదీ ఈ నెల 9 న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.. ఢిల్లీ లో ప్రధాని ప్రమాణ స్వీకారం 9న జరిగితే చంద్రబాబు నాయుడు12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. ఎన్డీఏ కీలక సమావేశాలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇండియా కూటమి కూడా కీలక మీటింగ్ జరుపుతోంది. చంద్రబాబు ని, నితీష్ ని కలవాలని ఇండీ కూటమి కూడా భావిస్తోన్న తరుణం లో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి.
previous post