విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహ పూరిత ప్రభుత్వాలతో మళ్లీ ఒక్కటవ్వనున్నాయి.. భౌగోళికంగా వేరు వేరు గా ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలతో సానుకూల వాతావరణం రానుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారుఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు కి అలాగే విజయం లో భాగస్వామ్యం అయిన జనసేనాని పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.. ఇటీవల తిరుమల దర్శనానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి త్వరలో ఏపీ కి కాబోయే కొత్త ముఖ్యమంత్రి ని కలవనున్నట్టు చెప్పారు. 2014 లో తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాల్లో కొలువు తీరిన ప్రభుత్వాలు సయోధ్య తో వుంటాయని అంతా భావించారు.. అమరావతి రాజధాని అంశం గాని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గాని తెలంగాణ లో టీడీపీ వ్యవహారం గాని… ఇలా రకరకాల కారణాలతో అప్పటి టీఆరెస్ ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది గానే వ్యవహరించింది.. ఉమ్మడి రాజధాని లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రోటోకాల్ అంశం లో కూడా అప్పటి కేసీఆర్ సర్కారు కాస్తంత ఇబ్బంది పెట్టేలాగే ప్రవర్తించింది.. హక్కు ఉన్న రాజధాని ని వదులుకుని అమరావతి ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలంటే హైదరాబాద్ ను వదుకోవాల్సిందేనని భావించి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం కార్యకలాపాలన్నీ అమరావతి కేంద్రం గానే కొనసాగించారు.. కేసీఆర్ అంటీముట్టనట్లు వ్యవహరించారు.. ముందస్తు ఎన్నికల్లో గెలిచి తెలంగాణ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేరిన కేసీఆర్ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి తో సత్సంబంధాలు నడిపిన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏపీ కి మేలుజరిగే ఏ అంశానికి కేసీఆర్ సర్కార్ సహకరించలేదు.. జగన్ మాత్రం తెలంగాణ కు ప్రయోజనం కలిగే ఎన్నో విషయాలపై అన్ కండీషనల్ గా సహకరించారు.. బంధం బయట పడకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నించారు.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై దేశవ్యాప్తంగా నిరసన లు పార్టీలకు అతీతం గా జరిగితే జగన్మోహన్ రెడ్డి తో కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న రహస్య బంధం వలన హైదరాబాద్ లో నిరసనలు చేస్తున్న వారిపై అప్పటి మంత్రి కేటీఆర్ నోరు పారేసుకున్నారు.అయిన ఉద్యమం స్థాయి పెరిగి కేసీఆర్ సర్కార్ కూల్చే నిర్ణయానికి చేరింది. 2023 ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ గెలుస్తారన్న ఆకాంక్ష ను జగన్ బహిరంగం గానే వ్యక్తపరిచారు. అవసరమైన నిధులను కూడా ఆయనే పంపించారన్న గుసగుసలు బహిరంగంగానే వినిపించాయి.. అయితే అనూహ్యంగా పార్టీ ఘోర పరాజయాన్ని చూసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదన్న నిర్ణయం కూడా బీఆరెస్ కొంప ముంచాయి అని విశ్లేషకుల మాట.. పార్టీ కి నష్టం కలిగి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్నా చంద్రబాబు మాత్రం అప్పటి ఎన్నికలు దూరంగా ఉండాలని నిర్ణయించారు.. అయితే తనకందిన సమాచారం బట్టి అంటూ 2024 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ లో మళ్ళి జగన్ అధికారంలోకి రానున్నాడని కేసీఆర్ తన ఆకాంక్ష ను ప్రజల కోరికగా చెప్పుకొచ్చారు.. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఏదో రెండు స్థానాలు మినహా అన్నిచోట్లా డిపాజిట్ కోల్పోయిన బీఆరెస్ ఏ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఫ్రెండ్లీ గా చూడలేదు.. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో గురుశిష్యులు ముఖ్యమంత్రులు గా వుండడం తో రెండు రాష్ట్రాలు అత్యంత స్నేహపూరితంగా వ్యవహరించనున్నాయని ప్రజలు భావిస్తున్నారు.. అభివృద్ధి లో పోటీ పడి దేశంలోని అత్యుత్తమ స్టేట్స్ గా నిలబడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.