విశ్వం లో అరుదైన అద్భుతంజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలిసే అద్భుతం. పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది జూన్ 5న ఆవిష్కృతం కానుంది. బుధ, శుక్ర, సూర్యుడు, చంద్రుడుతో పాటు గురు గ్రహాలు మిథున రాశిలో కలవబోతున్న ముందే మరో విశేషం విశ్వం లో కనపడనుంది. ఒక అరుదైన ఖగోళ సంఘటన స స్కైగేజర్లకు ఉల్లాసాన్ని కలిగించే అవకాశం ఉంది. రేపు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన గ్రహాల అమరిక కనిపిస్తుంది . గ్రహాల అమరికను గ్రహాల కవాతు 2024 అని కూడా పిలుస్తారుబుధుడు, బృహస్పతి, శని, అంగారకుడు(మంగళ), వరుణుడు(యురేనస్) మరియు ఇంద్రుడు (నెప్ట్యూన్) గ్రహాల సమలేఖనం ఈ నెల 3,4,5 తేదీలలో కనువిందు చేయనుందిఖగోళ శాస్త్ర ఔత్సాహికులు మిస్ కాకూడదనుకునే అద్భుతమిదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.. సౌర వ్యవస్థలోని గ్రహాలు సరళ రేఖలో లేదా దానికి దగ్గరగా ఉండేలా కనిపించే అమరిక ఇదని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ తెలిపింది. జూన్ 3 కంటే ముందు బృహస్పతి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది,దీనిని నేరుగా కళ్ళతో చూసే అవకాశం ఉంటుందని పేర్కొంది. వారం గడిచేకొద్దీ బుధుడు దాని స్థానాన్ని ఆక్రమిస్తాడు.ఈ గ్రహాల అమరిక సమయంలో, శని తూర్పు ఉదయం ఆకాశంలో ప్రముఖంగా ప్రకాశిస్తుంది, పసుపు రంగులో కనిపిస్తుంది, అంగారక గ్రహం క్రింద ఎరుపు రంగులో ఉంటుంది. చంద్రుడు తన చంద్రవంక దశలో కూడా కనిపిస్తాడు.సూర్యోదయానికి సుమారు ఇరవై నిమిషాల ముందు, బృహస్పతి మరియు అంగారక గ్రహాలు కనిపిస్తాయి, మెర్క్యురీ తూర్పు హోరిజోన్ నుండి 10 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. యురేనస్ మరియు నెప్ట్యూన్, అస్పష్టంగా ఉంటాయి, అయితే వీనస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది.ఈ అపూర్వ దృశ్యాన్ని భారతదేశం లో ఎక్కడినుంచైన చూడవచ్చని అస్ట్రోఫిజిక్స్ తెలిపింది
previous post
next post