కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చెయ్యడం, PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిజిపి హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వివాదాలపై దారి తీసే పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామనీ, హెచ్చరించారు.ఆ తరహా పోస్టులను, ఫోటోలను , వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధం. గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలియచేసారు. ఈ విషయాన్ని అందరు గమనించగలరు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.
previous post
next post