Vaisaakhi – Pakka Infotainment

కోళ్లు కనిపెట్టిన అతిపెద్ద భూగర్భ నగరం..

భూగర్భం లో కొన్ని వందల మైళ్ళ విస్తీర్ణంలో అతిపెద్ద నగరం ప్రపంచానికి దూరంగా.. మౌనంగా.. అలాగే భూపోరలలో ఒదిగిపోయిన ఆ నగరాన్ని కొన్ని కోళ్లు బయటపెట్టాయి.. వందల మైళ్ల నగరం ఏంటి.? చిన్న కోళ్లు బయట పెట్టడమేంటి..? ఆ నగరం ఎక్కడుంది.. దాని వెనుక కాదేంటి..? టర్కీలోని నెవ్సెహిర్ ప్రావిన్స్‌లోని డెరింక్యు సిటీ కి అత్యంత సమీపంలో దాదాపు ఎనబై ఐదు మీటర్ల లోతులో ఉన్న ఈ నగరం 1963 లో వెలుగు లోకి వచ్చింది. ఒక రైతు తన పెంపుడు కోళ్లు ప్రతిరోజు మాయమవుతూ ఉండటం తో నిఘా పెట్టాడు.. దొంగలు ఎవరూ దోచుకుపోతున్న దాఖలాలు లేవు.. కోళ్లు ఎలా మాయమైపోతున్నాయి అన్న ఉత్సుకత తో మరింత అలెర్ట్ గా వున్నాడు ఇంటి నిర్మాణం లో ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి కోళ్లు వెళ్లడం గమనించాడు. అయితే, అవి తిరిగి రాకపోవడంతో ఆ స్థలాన్ని నిశితంగా పరిశీలించి అక్కడ తవ్వి చూడగా భూమి లోపలకు ఒక దారి కనిపించింది. మరింత తవ్వకాలలో భూగర్భంలో ఉన్న అతిపెద్ద నగరం ఆవిష్కృతమైంది.. ఇళ్లతోపాటు అనేక కట్టడాలు దర్శనమిచ్చాయి. పాడి పశువులను భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పశువులశాలల్లో కట్టేవారు. నగరం లోపల నివాస స్థలాలు, సెల్లార్ లు, పాఠశాలలు, సమావేశ ప్రాంగణాలతో పాటువైన్ ఉత్పత్తి చేసే సెల్లార్ లు బయటపడిన ఈ ప్రాంతాన్ని డెరిన్కుయు అన్న పేరుతోనే పిలవడం ప్రారంభించారు.. అనోట ఈ నోటా దీనిగురించి విన్న ప్రజల తాకిడితో భూగర్భ నగరం నిండిపోయింది.1985లో ఈ భూగర్భ నగరాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చింది. అయితే ఈ నగర నిర్మాణం ఎప్పుడు జరిగిందనే విషయం కచ్చితంగా తెలియనప్పటికి క్రీస్తు పూర్వం 370లో ఏథెన్స్ కు చెందిన సెనో ఫోన్ రచించిన అనా బాసిస్ అన్న గ్రంధంలో ఈ నగరం ప్రస్తావన ఉంది. ఈ బుక్ లో కప్పడోషియా చుట్టుపక్కల భూగర్భంలో నివసిస్తున్న అనటొలియన్‌ల గురించి ప్రస్తావించారు. అయితేఈ భూగర్భ నగర నిర్మాణాన్ని హిటైట్ లు చేశారని మరికొంతమంది తమ పరిశోధకులల్లో పేర్కొన్నారు.

క్రీస్తు పూర్వం 1200లో ఫిర్ జియాన్ ల నుంచి దాడికి గురైనప్పుడు ఈ సొరంగ నగరాల నిర్మాణం జరిగి వుంటుందని సొరంగాల్లో హిటైట్‌లకు చెందిన కొన్ని కళారూపాలు ఉండటం తో వీటిని దృవీకరిస్తున్నప్పటికినగరంలో ఎక్కువ భాగాన్ని ఫిర్‌జియాన్‌లు నిర్మించారని ఇనుము యుగంలో అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్ లు. విస్తృతమైన భూగర్భ సౌకర్యాలను నిర్మించే సాధనాలు వీరి దగ్గర ఉండేవి” అని డీ జియోర్జీ అనే పరిశోధకుడు చెప్పారు. అద్భుతమైన రాతి ద్వారాలను నిర్మించే నైపుణ్యం వీరికి ఉందని వీరి రాజ్యం డెరిన్ కుయుతో పాటు పశ్చిమ, మధ్య అనటోలియా అంతా విస్తరించి ఉండేదని అని చెప్పారు. బైజాంటైన్ పాలనలో డెరిన్‌కుయన్ భూగర్భ నగరం ఇరవై వేల మంది నివాసం ఉండగలిగే స్థాయికి చేరింది. తరువాత క్రైస్తవ బైజాంటైన్ రాజ్యం పై ఇస్లామిక్ దాడులు మొదలైన 7వ శతాబ్దంలో ఈ భూగర్భ ఆవాసాలను పూర్తిగా వినియోగించుకున్నారని ఆయన చెప్తున్నారు. ఈ భూగర్భ విస్తరణ లో ఫిర్ జియాన్ లు, పర్షియన్ లు, సెల్ జుక్ లు పాలుపంచుకున్నారుఇక్కడ నివసించే వారు కాలకృత్యాలు కోసం సీలు చేసిన మట్టి జాడీలను వినియోగించేవారు. కాగడాల వెలుగులోనే కాలం గడుపుతూ, ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఒక నిర్ణీత ప్రదేశంలో ఖననం చేసేవారు. నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన మంచి నీటి బావిని 55 మీటర్ల లోతులో తవ్వారు.ఈ నగరానికి చేరేందుకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన 600కు పైగా సొరంగ మార్గాలున్నాయి అలాగే 200కు పైగా చిన్న చిన్న భూగర్భ నగరాలు అనుసంధానమై ఉండవచ్చని చెబుతున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More