తెలంగాణ దశమ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించనుంది. కాకతీయ, కుతుబ్ షాహీ రాజవంశాల చిహ్నాలైన కాకతీయ కళా తోరణం మరియు చార్మినార్‌ల చిహ్నాన్ని మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిహ్నం లో గత పాలకుల, దొరల నియంతృత్వానికి ప్రతీకగా ఉందని అందుకే ఇలాంటి చిహ్నాలను మార్చి ప్రజల ఎంబ్లమ్ ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఎంబ్లమ్ డిజైన్ లో భాగంగా పన్నెండు డ్రాఫ్ట్ డిజైన్‌లను సమర్పించిన ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.ఎంబ్లమ్ డిజైన్‌లో మరికొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేయనుందట.తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించే డిజైన్ తో జూన్ 2 నాటికి పూర్తిస్థాయిగా పలుమార్పులు చేర్పులు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయనుందిగత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాల్లో చిహ్నం మార్పు ఒకటి. అయితేచిహ్నం మార్పు పై బీఆరెస్ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాయకులు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు.. ఇది తప్పుడు నిర్ణయమని విమర్శలు మొదలుపెట్టారు.అలాగే అందె శ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతాన్ని కూడా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా స్వీకరించి దీనికి సంగీతం అందించడానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణిని రేవంత్ రెడ్డి తీసుకున్నారు కీరవాణి, అందెశ్రీలతో సమావేశమైన ముఖ్యమంత్రి గీతంలో కొన్ని మార్పులు సూచించారు.. గీతం పై కూడా బీఆరెస్ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు.. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే కంపోజ్ చేయించాలని ఆంధ్రా కు చెందిన కీరవాణి చేసిన గీతాన్ని తాము అంగీకరించబోమని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, వినోద్ కుమార్ వంటి నేతలు రచ్చ మొదలుపెట్టారు.. దీనిపై రాష్ర్టంలో తీవ్ర నిరసన లు నిర్వహిస్తామని పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. ఇదే సందర్భంలో యాదాద్రి నిర్మాణానికి ఆనంద్ సాయి నియామకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. బీఆరెస్ నాయకులది అస్మదీయుడైతే ఒక నైజం తస్మదీయుడైతే ఒక నైజం అని కౌంటర్ ఇస్తున్నారు గత ప్రభుత్వం లో కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకి పంచినప్పుడు ఏమైందని విమర్శిస్తున్నారు.. ఇక గతంలోనే బీఆరెస్ ప్రభుత్వం టీఎస్(TS)ను టీజీ(TG)గా మార్పు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే..కేంద్రం కూడా దీనిపై గెజిట్ విడుదల చెయ్యడం తో ఇక నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీగా రిజిస్ట్రేషన్ జరగనున్నట్టు మంత్రులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహారూపాన్ని కూడా మార్చాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం అంటోంది.అయితే.. వీటి మార్పుల విషయంలో.. రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని, ప్రజల అభీష్ఠం మేరకు మార్పులు చేయనున్నట్టు మంత్రులు చెపుతున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఒక్కొక్క నిర్ణయాన్ని సమీక్షించడం పై బీఆరెస్ వర్గాలు గుర్రుగా ఉన్నారు. అయితే ఈ నిర్ణయాలు అమలు అయ్యాక సైలెంట్ గా ఉంటారా.. పోరాటాలు చేస్తారా అన్నది చూడాలి మరి.
previous post