వస్తున్న ప్రతి అప్డేట్ ని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీ కి పాల్పడుతున్నారు.. సైబర్ క్రైం పై ఎంత అప్రమత్తంగా వున్నా ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతున్నారు అలాంటి మోసాలకు సహకరిస్తున్న ఓ వ్యక్తి ని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు..ఇండియన్ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్ర బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు… సొంతంగా, ఏజెంట్ల ద్వారా వివిధ టెలికాం కంపెనీల సిమ్‌కార్డులు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కొనుగోలు చేసి వియత్నాం, కాంబోడియాలకు కొరియర్ ద్వారా పంపించేవాడు. విదేశాల నుంచి సైబర్ వంచకులు ఈ సిమ్ కార్డులను ఉపయోగించుకుని వంచనలకు పాల్పడేవాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇస్తామని, యూట్యూబ్‌లలో వీడియోలకు లైకులు కొడితే డబ్బులు వస్తాయని, నమ్మించి, వంచనలకు పాల్పడేవాడు. అరెస్టు చేసిన నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణను తీవ్రం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు పేరిట తైవాన్‌కు 24 సిమ్ కార్డులు పంపించేందుకు చేసిన పార్సిల్‌ను జప్తు చేసుకున్నారు!
previous post