ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, సీసాలో పెట్రోల్, డీజిల్ పోస్తే తీవ్ర చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ యజమానులను ఎలక్షన్ కమీషన్ హెచ్చరించింది.నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని పౌరసరఫరాల శాఖ ద్వారా పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు నోటీసులు పంపనున్నట్లు ఈ సీ తెలిపింది. ఇదిలా ఉండగాఎన్నికల తనిఖీల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. సార్వత్రిక ఎన్నికల క్రమంలో దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాలదే 45 శాతం వాటా అని, రూ.3,958 కోట్ల మేర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.స్వాధీనం చేసుకున్న సొత్తులో నగదు రూపేణా 849.15 కోట్లు, మద్యం 814.85 కోట్లు, మాదక ద్రవ్యాలు 3,958 కోట్లు, బంగారం, వెండి వంటి ఆభరణాలు 1,260.33 కోట్లు, ఇతర ఉచితాలు 2006.59 కోట్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
previous post
next post