తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది మే 27, 28ననిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేసినట్లు ప్రకటించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో మహనాడు వాయిదా చేస్తున్నట్లు ఆ పార్టీ అధికారం గా వెల్లడించింది. అయితే అదే తేదీలలో మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కు నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు ఉంటాయని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. చాలా సర్వేలు కూటమికి అనుకూలంగా ఫలితాలు వెల్లడించడంతో కూటమి అభ్యర్థులలో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది.130 నుంచి 140 వరకు ఎమ్మెల్యే సీట్లు తో పాటు అలాగే 20 ఎంపీ సీట్లను కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇక వైసిపి 30 నుంచి 50 ఎమ్మెల్యే సీట్లను అలాగే నాలుగు నుంచి ఆరు వరకు ఎంపీ సీట్లను గెలుస్తుందని ప్రచారం సాగుతుంది.కౌంటింగ్ ప్రక్రియ మరి కొన్ని రోజులలో ప్రారంభం కావడంతో ఇప్పటికిప్పుడే మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడం సరికాదనే అభిప్రాయానికి టిడిపి శ్రేణులకు వచ్చాయి.ఎన్నికల ఫలితాలు తర్వాత మరొకసారి అధిష్టానం మహానాడు నిర్వహించే తేదీలను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఈ మహానాడు జరుగుతుందనేది తెలుస్తుంది.మహానాడు లో బిజెపి కేంద్ర, రాష్ట్రస్థాయి నాయకులు జనసేన నాయకులతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని ప్రచారం జరుగుతుంది.
previous post
next post