ఆతి పెద్ద పండుగ లా ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతల భవిష్యత్తు ఈవీఎం మిషన్లలో భద్రంగా ఉంది.. ఎప్పుడూ లేనంతగా ఓటర్లు ఓటేసేందుకు పోటెత్తారు.. భారీ పోలింగ్ ఎవర్ని గద్దెనెక్కించ నుంది.. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేదు.. బెట్టింగులు పెద్దయెత్తున జరుగుతున్నాయి.. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా చెప్పలేకపోతున్నప్పటికి ఏ పార్టీకి ఎడ్జ్ ఉందన్న చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. గతంలో పోలింగ్ జరిగిన రోజునే సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చేవి దాంతో సరళి బహిర్గతం అయ్యేది.. ఒక్కో సర్వే ఒక్కో వైఖరి వెల్లడించినప్పటికి క్లారిటీ అయితే ఉండేది ఈ సారి పోస్ట్ పోల్ సర్వే పై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించడం అధికారికంగా సర్వే లు విడుదల కాలేదు.. దాంతో పార్టీ లు మైండ్ గేమ్ మొదలుబెట్టాయి.. వేరే ప్రాంతాలనుండి దేశాలనుంచి తమకే ఓటు వేశారని.. భారీ పర్సెంటేజ్ తమకే అడ్వాంటేజ్ అని వివిధ మాధ్యమాల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని మొదలు పెట్టేసాయి..పెన్షన్ తీసుకొనే వృద్దులు, వికలాంగులు పెద్ద ఎత్తున వైసిపి కి ఓటు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారని గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ షేర్ బాగా పెరిగిందని తమ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని అనుకూల మీడియాల్లో ప్రచారం మొదలు పెట్టేసారు.. ఐబీ రిపోర్ట్ అని ఒకరు… పీకే సర్వే అని ఇంకొకరు.. లాస్ట్ సర్వే మరొకరు ఎవరికి తోచిన డ్రామాలు వాళ్ళు మొదలెట్టేసారు.. అధికార పార్టీ కి ఏం సంకేతాలు ఉన్నాయో తెలియదు గాని పెద్దఎత్తున వైసీపీ గెలవబోతుందన్న ప్రచారం ఎక్కువ చేశారు.. గత ఐదేళ్లలో ఏపీకి జగన్ చాలా చేసారని మరో ఐదేళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందన్న పబ్లిసిటీ పీక్స్ లో చేస్తున్నారు కూటమికి, వైసీపీకి టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అనుకున్నప్పటికి ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆడిగినోళ్ళకి ఆడగనోళ్ళకి చెప్పేస్తున్నారు.. మంత్రి బొత్స దంపతులైతే జగన్ ప్రమాణ స్వీకారం వైజాగ్ లొనే అని చెప్పేసారు.. కొన్ని సీట్లు తగ్గినా నెక్స్ట్ ముఖ్యమంత్రి జగనే అని బల్లగుద్ది మరి చెప్పేస్తున్నారు.. మరోవైపు కూటమి అభిమానులైతే సోషల్ మీడియా పేజ్ లలో అయితే సంబరమే జరిపిస్తున్నారు.. మా పార్టీ గెలుస్తుంది… మావాడే హోమ్ మినిష్టర్.. రెండు ఎకరాల పందెం ఇలా మైండ్ గేమ్ పతాక స్థాయికి చేరింది.. నిన్న మొన్నటి వరకు ఆత్మ విశ్వాసం లో ఉన్నోళ్లు కూడా వాళ్ళు చెప్పిందే జరగబోతుందా.. అన్న మీమాంస లో పడ్డారు.. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా ఎవరు గెలవబోతున్నారు అన్న ఎంక్వైరీలు మొదలుపెట్టారు.. గెలుపు పై పూర్తి ధీమా వున్నోళ్ళు కూడా అట అట కబుర్లకి అధిరిపోతున్నారు.. బీపీ లు పెంచేసుకుంటున్నారు.. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలం అన్నది పక్కన పెడితే ఫేక్ గాళ్ళ మాటలయితే కోటలు దాటిపోతున్నాయి.. ఇంత వరకు విజ్ఞత ప్రదర్శించిన పార్టీలు , ప్రజలు మరికొన్నాళ్లు సంయమనం పాటించి అదే ఆత్మవిశ్వాసం తో ఉంటే ఫేక్ గాళ్ళు పలాయనం చిత్తగించక తప్పదు…బీవేర్ ఆఫ్ మైండ్ గేమ్స్