చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది. ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు వంటి ఫిర్యాదులు లేదని, మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు రాకపోవడం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదిగ సంఖ్యలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, రిసెప్షన్ సెంటర్లకు చేసే పోలింగ్ ఈవీఎం లను స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య సురక్షింతంగా భద్రపర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉదయం 7.00 గంటలకే రాష్ట్రంలోని 46,389 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా మొదలైందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుండే క్యూలైన్లో పెద్ద ఎత్తున బారులు తీరారన్నారు. రాష్ట్రంలో నమోదు అయిన పోలింగ్ శాతం గురించి ఆయన మాట్లాడుతూ ఉదయం 9.00 గంటలకు 9.05 శాతం, 11.00 గంటలకు 23.10 శాతం, మద్యాహ్నం 1.00 గంటకు 40.26 శాతం, 3.00 గంటలకు 55.49 శాతం మరియు సాయంత్రం 5.00 గంటలకు 68.04 శాతం నమోదుఆయింది
పోలింగ్ ప్రారంభంలో 275 బ్యాలెట్ యూనిట్లు, 270 కంట్రోల్ యూనిట్లు, 600 వివిప్యాట్లలో చిన్న చిన్న సమస్యలు తలెత్తగా, వాటిని వెంటనే రెక్టిఫై చేయడం జరిగిందన్నారు. 20 శాతం అదనంగా ఈవీఎం లను రిజర్వులో ఉంచుకోవడం వల్ల ఈవిఎం ల సమస్యలను అన్నింటినీ సులభంగా అదిగమించి పోలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు. అక్కడక్కడా బి.యూ.లు, సి.యూ.లలో కొద్ది పాది సమస్యలు తలెత్తినప్పటికీ, వాటిని వెంటనే సరిదిద్ది పోలింగ్ ను సక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లాలకు అదిక సంఖ్యలో సి.ఏ.పి.ఎఫ్. బలగాలను ఇచ్చినప్పటికీ దాదాపు ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం లను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆయా ఈవిఎంలలోని డాటా చిప్ లలో స్టోర్ అయిఉన్నందున ఎటు వంటి సమస్యలు తలెత్తలేదని, రీపోలింగ్ కు అవకాశం ఉండే పరిస్థితులు ఇప్పటి వరకూ తలెత్తలేదని ఆయన తెలిపారు. రిటర్నింగ్ అధికారి, పరిశీలకుల సమక్షంలో రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, బ్యాలెట్ యూనిట్ లో పోల్ అయిన ఓట్లు మరియు 17ఎ రిజిష్టరులో నమోదైన ఓటర్ల వివరాలను సరిపోల్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఏమన్నా తేడాలు ఉంటే, వారి నివేదిక ప్రకారం రీపోల్ విషయాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు.
ఈవీఎమ్ లు అన్నింటినీ రాజకీయ పార్టీల ఏజంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి సీల్ చేయడం జరుగుతుందన్నారు. సి.ఏ.పి.ఎఫ్. బలగాలకు ఆ స్ట్రాంగుల భద్రతను అప్పచెప్పడం తో పాటు 24×7 సీసీ కెమేరాల నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పించడం జరుగుతుందన్నారు. పోటీలోనున్న అభ్యర్థుల తరుపున ఏజంట్లు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద 24×7 ఉండేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలవారిగా జరిగిన పోలింగ్ శాతాలు అల్లూరి జిల్లా 63.19 శాతం, అనకాపల్లి 81.63 శాతం, అనంతపురం 79.25 శాతం, అన్నమయ్య 76.12 శాతం, బాపట్ల 82.33 శాతం, చిత్తూరు 82.65 శాతం, అంబేద్కర్ కోనసీమ 83.19 శాతం, తూర్పు గోదావరి 79.31 శాతం, ఏలూరు 83.04 శాతం, గుంటూరు 75.74 శాతం, కాకినాడ 76.37 శాతం, కృష్ణా 82.20 శాతం, కర్నూలు 75.83 శాతం, నంద్యాల 80.92 శాతం, ఎన్టీఆర్ 78.76 శాతం, పల్నాడు 78.70 శాతం, పార్వతీపురం మన్యం 75.24 శాతం, ప్రకాశం 82.40 శాతం, పొట్టిశ్రీరాములు నెల్లూరు 78.10 శాతం, శ్రీ సత్యసాయి 82.77 శాతం, శ్రీకాకుళం 75.41 శాతం, తిరుపతి 76.83 శాతం, విశాఖపట్నం 65.50 శాతం, పశ్చిమ గోదావరి 81.12 శాతం, వైఎస్సార్ 78.12 శాతం,నమోదైంది.
previous post