ఈ దశాబ్దం లో అత్యంత కీలకమైన ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాలనుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వెళ్లిన తరుణంలో ఏపీ లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తుంటే హైదరాబాద్ లో మాత్రం పోలింగ్ యధాప్రకారం నీరసం గా నిస్తేజంగా మొదలయ్యింది.. (రాసే సమయానికి అత్యల్ప ఓటింగ్ నమోదైంది) ఎండ అంత లేనప్పటికీ ఓటర్లు ఇల్లు కదలకుండా కూర్చోవడం విస్మయానికి గురి చేస్తుంది. నేను ఓటు వేస్తే ఎంత.. ? వేయకపోతే ఎంత..? అన్న నిర్లక్ష్య ధోరణి మంచిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.. ఓటింగ్ రోజును సెలవుగా ఫీలయ్యి సెలవును ఇంటికే పరిమితం అవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం అంటూ విమర్శిస్తున్నారు.. అయితే మన దేశంలో ఓటు వేయకపోయిన తక్కువ నమోదైంది అని ప్రభుత్వాలు ఊరుకుంటాయి.. కానీ కొన్ని దేశాల్లో పనిష్మెంట్ మాములు గా ఉండదు..బెల్జియం* లో వరుసగా 4 సార్లు ఓటేయకపోతే..10 ఏళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10 వేలు జరిమానా వేస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా 96 % శాతం ఓటింగ్* నమోదవుతుంది.అలాగే ఆస్ట్రేలియా లోనూ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ కూడా 98 % శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ లో అయితే ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఓటు హక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 % శాతం నమోదవుతుంది.గ్రీస్ లో ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ ఏకంగా 94 % శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఇలా మరి కొన్ని దేశాలు నిర్బంధ ఓటింగ్ ని అమలు చేస్తున్నాయి.ఇలాంటి నిబంధనలు భారత్ లో కూడా అమలు లో ఉంటే ప్రజల్లో భాధ్యత పెరుగుతుందని భావిస్తున్నారు.. ప్రతిఒక్కరు ఓటును భద్రతా గా తీసుకోవాలని అంటున్నారు.. గతంలో అతితక్కువ మెజార్టీ తో ఫలితాలు మారిపోయిన సంఘటన లు చాలా వున్నాయి.2004 కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో సంతేమారహళ్లి నియోజకవర్గంలో కేవలము ఒకే ఒక్క ఓటు ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ ధ్రువ నారాయణ్ గెలిచారుఅంటే రెండు ఓట్లు తనకు అదనంగా ప్రత్యర్థి కి పడి ఉంటే జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థి ఆర్. కృష్ణమూర్తి గెలిచి ఉండేవారు. ధృవనారాయణ్ 40,752 ఓట్లు నమోదు అవ్వగాఆర్. కృష్ణ మూర్తి -40,751ఓట్లు వచ్చాయి. అలాగే 2008 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో నాథ్ ద్వార నియోజకవర్గంలో బి.జె.పి అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ గెలిచారు కూడా ఒకే ఒక్క ఓటు ఆధిక్యతతో విజయం సాధించారు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సి.పి. జోషి కి మరో రెండు ఓట్లు పడి ఉంటే ఆయన గెలిచి ఉండేవారు. కళ్యాణ్ సింగ్ చౌహాన్ కి 62,216 ఓట్లు పడగాసి. పి. జోషి 62,215 ఓట్లు పడ్డాయి.. ఆంద్రప్రదేశ్ విషయానికి వస్తే 1989 లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అంటే 10 ఓట్లు తెలుగుదేశం అభ్యర్థి పి. అప్పల నరసింహం కి పడి ఉంటే గెలుపు దక్కేదికొణతాల రామకృష్ణ 6,59,253 ఓట్లు పొలవ్వగాపి.అప్పలనరసింహం 6,59,244 వచ్చాయి.1998 లోక్ సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రం రాజమహల్ నియోజకవర్గంలో బి.జె.పి అభ్యర్థి సోమ్ మరండి కూడా 9 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. సోమ్ మరండి 1,98,889కి ఓట్లు పొలవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి థామస్ హన్స్1,98,880 ఓట్లు పొంది ఓటమి పాలయ్యారు. గత 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు కూడా 25 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఇంకా చాలా ఎన్నికల్లో 50 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ సంఘటనలన్నీ ప్రతి ఓటు విలువ ను తెలియజేస్తున్నాయి.. అందుకే ఓటు హక్కే కాదు విస్మరించలేని బాధ్యత.
previous post
next post