ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి వస్తే.. అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు కారణమవుతుందని షర్మిలను ఉద్దేశించి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు…వైఎస్ రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు ఉందనితాను ప్రస్తుతం వైఎస్ వారసుడిగా తాను ఉన్నందున షర్మిల రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారాలు చూసుకుంటే బాగుండేదన్నారు…ఒకరు పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మరొకరు ఒకే కుటుంబం నుంచి వస్తే.. అది రాజకీయ పార్టీగా ఉండదని.. కుటుంబ ట్రస్ట్ట్‌గా మారిపోతుందన్నారుకుటుంబంలో మరొకరు పోటీగా వచ్చినప్పుడు అది కుటుంబ బంధాలను నాశనం చేస్తుందని.. ఇది మా విషయంలో రుజువైందన్నారు..ఈ విషయాన్ని షర్మిల కు చెప్పడానికి ఎప్పుడైనా ట్రై చేశారా అని ప్రశ్నికు.. “ఆవిడ చంద్రబాబు మాట వింటుంటే తాను ఎలా చెప్పగలను” అన్నారు. ప్రతీ విషయం చంద్రబాబుతో సంబంధం ఉందని ఎలా చెప్పగలరు అంటే.. “తాను నా చెల్లెలు.. నాకు తెలుసు కదా..” అని బదులిచ్చారు ..షర్మిల ప్రచారం, కాంగ్రెస్ పార్టీ వల్ల తనకు ఎలాంటి నష్టం ఉండదని జగన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదని ..ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలంటూ సూటిగా చెప్పారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్లడంపై జగన్ ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓ రాజకీయ పార్టీగా అది వాళ్లిష్టం అని.. తమను మాత్రం పొత్తులోకి రావాలని బీజేపీ కోరలేదన్నారు..వ్యక్తిగతంగా తాను రాహుల్ గాంధీ కన్నా.. మోదీ వైపే మొగ్గు చూపుతానని.. రాహుల్ తన పట్ల వ్యవహరించిన తీరుకు తాను ఆయన కన్నా ఏ నాయకుడినైనా ఉన్నతంగానే భావిస్తానని వ్యాఖ్యానించారు..
previous post
next post