ఇదేదో ప్రెసిడెంట్ మెడల్ లాగో.. స్పెషల్ స్టేటస్ లాగో కొత్త బ్రాండ్ కాదు… కంప్లీట్ న్యూ వెర్షన్.. ఇప్పటికి హల్చల్ చేస్తున్నాయి నాసిరకం లిక్కర్ కి కేటుగాళ్ళు ఇంకో కల్తీ ని జోడించారు.. ప్రజల ప్రాణాలు ఎలా పోయినా పర్వాలేదు.. డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్న నకిలీగాళ్ళు హోమియోపతి మందులతో అక్రమంగా, అత్యంత ప్రమాదకరంగా మద్యం తయారుచేసి విక్రయాలు జరుపుతున్నారు… హోమియోపతి మందుగా ఉపయోగించే బెల్లడోనా అనే ద్రావణాన్ని వాడి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న ఒరిస్సాకు చెందిన దంపతులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఒరిస్సా నుంచి విశాఖకు తరలివచ్చిన ఓ జంట కు ఇదో కుటీర పరిశ్రమగా మారింది. హోమియోపతిలో మెగ్రైన్ లాంటి లక్షణాల్ని నియంత్రించేందుకు వాడే శక్తివంతమైన మెడిసిన్ బెల్లడోనా లో కార్బో వెజిటబుల్, అస్పిడోస్పెర్మా లాంటి ద్రావకాలు కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఒక బెల్లడోన బాటిల్ నుంచి ఒక హాఫ్ బాటిల్ కల్తీ మద్యాన్ని తయారుచేస్తున్నారు. ఇలా తయారుచేసిన మద్యాన్ని క్వార్టర్ కాదు, అందులో సగం తాగినా కిక్కిస్తుంది, ఆ వెంటనే ఆరోగ్యం పాడవుతుంది.ఇలా అక్రమంగా తయారుచేసిన 775 మద్యం బాటిళ్లను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తిలోని ఓ అపార్ట్ మెంట్ లో జరుగుతున్న ఈ దందాలో శిరీష అనే మహిళ ను వాటిని విక్రయిస్తున్న ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..
previous post
next post