ఈనెల 10వ తేదీ లోపు దాదాపుగా 70 లక్షల మంది ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోకి ఎంటర్ అవ్వనున్నారా..? బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్స్, కార్లు, అందుబాటులో ఏ వాహనం ఉంటే ఆ వాహనాల్లో సొంత గ్రామాలకు వచ్చేందుకు సిద్ధమయ్యారా..? దానికి అనుగుణంగానే ఇప్పటికే టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి. అందుకే రైల్వే, బస్సు రిజర్వేషన్లు లేవని ఆన్లైన్ రిజర్వేషన్ యాప్స్ చూపిస్తున్నాయా..? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సింగిల్ ఆన్సర్ ‘ఎస్’ అంటున్నారు చాలామంది.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఒక సవాలుగా ఈనెల 13వ తేదీన జరగనున్న ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రవాసాంధ్రులు తమ అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుని తమ స్వగ్రామాలకు రానున్నారు.. ఒక్క హైదరాబాదు నుంచి దాదాపు ఇరవైఐదు లక్షలకు పైగా ఓటర్లు ఏపీకి రానున్నారని సమాచారం అలాగే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ప్రవాస భారతీయులు కూడా ఈసారి ఎన్నికల్లో ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలే రానుపోను ఖర్చులు పెట్టుకొని ఓటింగ్లో పాల్గొనమని ఆహ్వానిస్తే ఈసారి ఎక్కువ శాతం ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగబోతోందని దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా రానున్నాయని కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఓటర్ల రాక మేరకు అన్ని పార్టీలు ఎవరి విశ్లేషణలు వారు చెసుకుంటున్నారు.. ఒక వేళ భారీ ఓటింగ్ నమోదయితే కూటమి విజయం భారీ స్థాయి లో ఉంటుందని ఏ సర్వే సంస్థా అంచనా వేయలేని స్థాయి లో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రం లో ఇంతవరకు జరిగిన ఎన్నికలు ఒకెత్తు ఈ ఎన్నికలు ఒకెత్తు అన్న వ్యాఖ్యానాలతో ప్రయాణాలు మొదలుపెట్టేశారు.. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఎడ్జ్ ఎవరికి వున్నా గెలుపు ఎవరిదైన ఈ ఎన్నికల్లో సంచలనాలు నమోదు అవ్వడం ఖాయం..
