తెలంగాణలో ఓ వ్యక్తిని హత్య చేసి అక్కడి పోలీసుల నుంచి తప్పించుకుని కోల్కతా పారిపోతున్న ఇద్దరు నిందితులను విశాఖ జి ఆర్ పి పోలీసులు పట్టుకున్నారు. హతుడి నుంచి దొంగలించిన నగదును స్వాధీనం చేసుకుని తెలంగాణ పోలీసులకు అప్పగించారు.
బెంగాల్ కు చెందిన ఖుర్భాన్ అల్ ముల్ల(20), మరొక జువెనైల్ లు మహీపాల్ రెడ్డి అనే వ్యక్తి వద్ద కూలీ పనికి చేరి అతనిని చంపి, మృతుని సెల్ ఫోన్ ని మృతుని డెస్క్ లో గల రూ.18000 ల నగదు ను దొంగిలించి తెలంగాణ వదిలి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్ కు బస్ లో వెళ్ళి, రైల్వే స్టేషన్ కు చేరుకుని ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ద్వారా వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సిద్దిపేట్ కమిషనరేట్, జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం జీఆర్పీ పోలీసులకు ఈ సమాచారం ఇచ్చి విజ్ఞప్తి చేయడంతో విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ బి.మోహనరావు ఆదేశానుసారం విశాఖ రైల్వే ఇన్స్పెక్టర్ సిహెచ్ ధనంజయ నాయుడు ఆధ్వర్యం లో సబ్-ఇన్స్పె క్టర్ఆ ర్ పి ఎస్ ఐ జి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐ ఆర్.గౌరీ నాయుడు, హెచ్ సి ఉదయ భాస్కర్, శ్రీనివాసులు ఇతర సిబ్బంది సహాయంతో ముమ్మర తనికీలు నిర్వహించి, మాటువేసి ఆ ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు..నిందితులను అదుపులోకి తీసుకున్న విశాఖ జీఆర్పీ పోలీసులు కు కమిషనర్ సిద్దిపేట్ కమిషనర్ అబినందనలు తెలియ జేసారు.
previous post
next post