Vaisaakhi – Pakka Infotainment

ఉల్లి పై ఈ నల్ల మచ్చ ఎంత డేంజరో తెలుసా..?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదని ఓ పాత మాట.. అది ఓల్డ్ అయిన గోల్డెన్ వర్డ్
ఉల్లిలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి.. అప్పుడప్పుడు ధరల విషయంలో కన్నీళ్లు తెప్పించినా.. ప్రభుత్వాలను కూల్చినా ఉల్లి మాత్రం నిజంగా తల్లి లాంటిదే.. జీర్ణవ్యవస్థ తో పాటు గుండెను కాపాడి మన శరీరంలో ఎదురయ్యే ఎన్నో అలర్జీలకు ఉల్లి ఏకైక పరిష్కారం. ఉల్లి వాడని ఏ వంటకం కూడా రుచిగా ఉండదు.. ఈ మధ్య ఉల్లి ని ఆరోగ్యం తో పాటు అందానికి, కూడా మనవాళ్ళు వాడేస్తున్నారు. అందుకే మన రోజువారీ జీవితంలో ఉల్లి ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోయింది.. 85 శాతం నీరే ఉండే ఉల్లిపాయలు కోసేటప్పుడు ‘సిన్ ప్రొపనెథియల్ ఎస్ ఆక్సైడ్’ (Syn-propanethial-S-oxide) అనే రసాయనం విడుదలవడం వలన కళ్ల కొనల్లో ఉండే లాక్రిమల్ గ్రంథులను ఉత్తేజితం అయి కన్నీళ్లు వస్తాయి.ఈ మధ్య కాలంలో మనం ఉల్లిపాయలను ఉపయోగించేటప్పుడు వాటిపై నల్లటి మసి లాంటిది ఎక్కువ సార్లు గమనించే ఉంటాం.. తోలు తీసేటప్పుడు చేతికి ఆ నల్లటి మసి అంటుకుంటూ చిరాకు కలిగిస్తుంది.. అయితే ఆ ఉల్లి తొక్క తీసేసి క్లీన్‌ చేసి వాడేస్తుంటాం. భూమిలో పండే ఉల్లిపాయ పై ఇలా నల్లగా ఎందుకు వచ్చింది… అది ఏంటి..? అలాంటి నల్లటి మచ్చ ఉన్న ఉల్లిపాయలు తింటే ప్రమాదమా..? లేక లైట్ తీసుకోవచ్చా..?

ఉల్లిపాయలపై కనిపించే ఈ నల్లటి మచ్చను ‘ఆస్పర్‌ గిల్లస్ నైగర్’ అంటారు.ఇది ఒక రమైన ఫంగస్ ఇలాంటిది మట్టిలో కనిపిస్తుంది. అదే మట్టి ద్వారా ఉల్లిపాయలకు చేరుకుని ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. ఒక రకమైన టాక్సిన్‌ను విడుదల చేస్తుందని పరిశోధనలో తేలిన ఈ నలుపు ప్రాణాపాయం కానప్పటికీ, ఇది అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుందని నిపుణులు చెపుతున్నారు.. ముఖ్యంగా అలర్జీలు ఉన్నవారు ఈ బ్లాక్ అచ్చు ఉల్లిపాయను తినకుండా ఉంటే మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని అంటారు.. కాబట్టి బ్లాక్ మచ్చ ఉన్న పొరను పూర్తిగా తొలగించి మిగతాది ఉపయోగించవచ్చు. ఇలాంటి నల్ల మచ్చలను కలిగి ఉన్న ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఇతర ఆహార పదార్థాలకు కూడా ఆ ఫంగస్ వ్యాపించి వాటిలో కలిసిపోయి ఆ ఆహారం విషతుల్యం గా మారుతుందని హెచ్చరిస్తున్నారు.. అలాగే ఉల్లిపాయలను కట్‌ చేసేప్పుడు పైన ఉండే గట్టి పదార్థాన్ని కూడా తొలగించి తినాలని దానిని అలాగే కూరలో వేసి తినడం వల్ల పైల్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు..ఇక ఉల్లి ట్రాక్ రికార్డ్ ని పరిశీలిస్తే ప్రపంచంలో అతి పెద్ద ఉల్లిపాయ 2015లో పండింది. బ్రిటన్‌లోని లీస్టర్స్‌షైర్‌లో పండిన ఈ ఉల్లిపాయ బరువు 8.49 కేజీలు. నాలుగు వేల ఏళ్ల కిందట నుంచే మెసపటోమియాలో ఉల్లిని వినియోగించినట్లు ఆధారాలున్నాయి.. చిత్రలిపిలో ఉన్న ఈ విషయం 1985 లో వెలుగు చూసింది. అంత పురాతన పంట ఈరోజుకి కూడా అంతే ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఉల్లిలో 45 శాతం భారత్, చైనాలలోనే పండుతోంది. అయితే, ఉల్లి తలసరి వినియోగం అత్యధికంగా ఉన్న దేశాలు మాత్రం ఈ రెండూ కావు. ఉల్లి తలసరి వినియోగం లిబియాలో అత్యధికంగా ఉంది. ఏడాదికి ఏకంగా సగటున 33.6 కేజీల ఉల్లి వీరు ఆరగిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి లెక్కలు చెప్తున్నాయి. లిబియా తరువాత అల్బేనియా, తజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, అల్జీరియా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ప్రపంచంలోని 175 దేశాల్లో ఉల్లి ని పండిస్తున్నారు గోధుమలు పండించే దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More