ఢిల్లీ పర్యటన లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఆసక్తికరమైన చర్చకి దారితీసాయి.. జాతీయ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సంభాషణలో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తూనే బిజెపితో పొత్తుకు సమయం మించిపోయింది అని చెప్పడంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.. అయితే ఈ వ్యాఖ్యలు… మించిపోయిన సమయం.. కేవలం తెలంగాణకు మాత్రమేనా ఆంధ్ర కూడా వర్తిస్తాయి అన్న మీమాంసకు తెరలేచింది. 2024 ఎన్నికల్లో జనసేన, బిజెపితో తెలుగుదేశం పార్టీ కలిసి వెళుతుందన్న ప్రచారం గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన పొత్తు పై క్లారిటీ ఇచ్చిందా..? అందుకే టిడిపి అధినేత ఈ విధమైన వ్యాఖ్యలు చేశారన్న అనుమానాలు మొదలయ్యాయి.. 2018 ఎన్నికలకు ముందునుంచే వైఎస్ఆర్సిపి కి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ప్రతిపాదిత పొత్తు పై మొదటినుంచి ఏపీ బీజేపీ శాఖ గాని.. మరికొంత మంది కేంద్ర పెద్దలు గాని సుముఖంగా లేరన్నది సుస్పష్టం.. ఏపీలో బీజేపీ కి ఓటు బ్యాంక్ లేనప్పటికీ జనసేన పార్టీతోనే నడుస్తుంది.. టీడీపీ తో కలసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జనసేన బలంగా ఆశిస్తున్నప్పటికీ పొత్తు కుదిరే అవకాశాలను ఈ నాయకులు కాలరాస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. పొత్తు కు సమయం మించిపోయిందని ఓ వైపు చెప్తూనే దక్షిణాది లో బీజేపీ తెలంగాణ, కర్ణాటక కు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యలు చేయడం కూడా గమనార్హం. చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయనకున్న సమాచారం మేరకే చేశారా లేదా ఆంధ్రాని వేరే కోణంలోనూ తెలంగాణ వేరే కోణంలోను చూస్తున్నారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది