1960లో రష్యా లోని సైబీరియా లో కనుగొన్న ఓ బిలం భూమిని అమాంతం మింగేస్తు చుట్టుపక్కల భూభాగాన్ని తనలో కలుపుకుంటూ నానాటికి అది విస్తరిస్తూ పోతుండడం శాస్త్రవేత్తలను ఆశ్ఛర్యానికి గురి చేస్తోంది.. ఈ బిలం ఉపరితలం నుంచి 282 అడుగుల లోతులో ఉంటుంది. ఇది పాతాళానికి వెళ్లేందుకు ఒక మార్గమని స్థానికుల నమ్మకం. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రజలు దీన్ని “అండర్ వరల్డ్ గేట్వే” అని కూడా పిలుస్తారు. “మౌత్ టు హెల్” అనేది మరో పేరుతో పాటు దీనికి మెగా స్లంప్ అనే శాస్త్రీయ నామం కూడా ఉంది. మిగిలిన దేశాల కంటే రష్యా 2.5 రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఇది బిలం పెరిగేందుకు కారణమౌతోందని రష్యన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ బిలం చుట్టూ ఉన్న భూభాగం కరిగిపోతోంది. దీంతో ఈ మంచు బిలం విస్తరిస్తోంది. బిలంపై అసమానంగా ఉన్న ఉపరితలాలు కనిపిస్తున్నాయి. నేల కోతకు గురై ఇవి ఏర్పడ్డాయి. మంచు బిలం పెరిగిపోవడంతో చుట్టూ ఉన్న పట్టణాలు, రోడ్లు బీటలు వారుతున్నాయి. భూగర్భంలో ఉన్న పైపులైన్స్ దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాల దృష్యా భవిష్యత్తులో ఇది ప్రమాదకరం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కొందరు స్థానికులు దీన్ని కేవ్ ఇన్ అని కూడా పిలుస్తుంటారు. ముందుగా ఇది లోయగా కనిపించింది. ఆ తర్వాత వేసవిలో భూమి కరిగిపోయి బిలం పెద్దగా మారడం జరిగింది. ప్రతి ఏటా ఇది విస్తరిస్తూ వెళ్తుంది. ఈ ప్రాంతంలో విచక్షణారహితంగా అటవీ ప్రాంతాలను నిర్మూలించడంతో మంచు కరిగిపోయిందని, దీని వల్ల నేల కోతకు గురవుతోందని, ఈ కారణం కూడా బిలం విస్తరించడానికి కారణం కావచ్చనే కొందరు చెబుతున్నారు. దీని కారణంగా ఇప్పటి రష్యాలోని ఉత్తర, ఈశాన్య నగరాలు ప్రభావితం అయ్యాయని, అధిక ఉష్ణోగ్రతలు బిలం పెరిగేందుకు మరింత ఊతమిస్తున్నాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన శాశ్వత బిలం నానాటికి విస్తరిస్తూ ఉండటం ప్రమాదానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.
previous post
next post