ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కామన్.. అదే వారి గెలుపోటములను నిర్ణయించేది.. దశాబ్దకాలం నుండి పార్టీలు వ్యూహాలను మైండ్ గేమ్ వైపు డైవర్ట్ చేశాయి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా గేమ్స్ మొదలుపెట్టేస్తున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన పార్టీలు అయినా టిడిపి – వైసిపిల రసవత్తరంగా పోరు సాగే అవకాశం ఉంటే ఇప్పటికే టిడిపి, జనసేన కలిసి పోటీచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనసేన తో పొత్తులో ఉన్న బీజేపీ నోరు మెదపకపోయినా ఇంటర్నల్ వ్యూహాలకైతే పదునుపెట్టింది.. ముందుగా జనసేన- టిడిపి పొత్తుల పై ఒక అంగీకారానికి రావడం వల్ల టిడిపితో కలిసి వెళ్లేది లేదని మంకు పట్టు పట్టిన బిజెపి చివరకు అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సాగింది. ఈ పర్యటనలో కేంద్రమంత్రి అమిత్ షా తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే చర్చల సారాంశం ఏమిటన్నది బయటకి రానప్పటికీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయం పైన అలాగే సీట్ల కేటాయింపు పై ఈ చర్చలు సాగినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా వాట్సప్ గ్రూపులలో బిజెపి టిడిపి మధ్య పొత్తు కుదిరిందని, సీట్ల కేటాయింపు పై చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపాదన చేశారని బిజెపికి ఎనిమిది ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు ప్రచారం కొనసాగుతుంది. ఇందులో సుజనా చౌదరికి(విజయవాడ) పురంధేశ్వరి(విశాఖపట్నం) ఆదినారాయణ రెడ్డి(కడప), సీఎం రమేష్ (రాజంపేట) టిజి వెంకటేష్ (కర్నూలు) కామినేని శ్రీనివాస్ (ఏలూరు) సత్యకుమార్ (నెల్లూరు) జీవిఎల్ నరసింహారావు (నరసరావుపేట) ఎంపీ సీట్లను కేటాయించినట్లు ప్రచారం జోరందుకుంది. అలాగే 12 ఎమ్మెల్యే సీట్ల కేటాయింపునకు సంబంధించి కూడా కొందరి బిజెపి నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వరదాపురం సూరి(ధర్మవరం) , విష్ణువర్ధన్ రెడ్డి(కదిరి), విష్ణుకిమార్ రాజు(విశాఖ నార్త్), భానుప్రకాశ్ రెడ్డి(తిరుపతి) , సాధినేని యామినిశర్మ(గుంటూరు వెస్ట్), రమేష్ నాయుడు(రాజంపేట) , పివిఎన్ మాధవ్(విశాఖ వెస్ట్) , ఎస్.కే. భాజి(విజయవాడ వెస్ట్) అంజేయనేయరెడ్డి (నెల్లూరు సిటీ) పూడి తిరుపతి రావు(ఆముదాలవలస), సోము వీర్రాజు(రాజమండ్రి సిటీ), లంకా దినకర్ (గన్నవరం)ల పేర్లు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రతిపాదనలో ఉన్నాయన్నది ఆ మెసేజ్ సారాంశం బిజెపికి- వైసిపికి తెర వెనక ఉన్న సంబంధాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోను, అలాగే టిడిపితో కలిసి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్న బీజేపీ పెద్దలు నిర్ణయం మారడంతో టిడిపికి సందిగ్ధ పరిస్థితి నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి – బిజెపిని కలిపేందుకు చేసిన ప్రయత్నమే చంద్రబాబు నాయుడు – అమిత్ షా ఢిల్లీ సమావేశం. ఇప్పటికి కూడా ఢిల్లీ బిజెపి నాయకత్వం వైసిపి సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మరొక టీడీపీతో పొత్తుల పై చర్చలను కొనసాగిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి చెప్పుకోదగ్గ ఓటింగ్ లేదు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి రెండు ఎంపీ సీట్లలో అలాగే నాలుగు ఎమ్మెల్యే సీట్లలో గెలవడమే చాలా కష్టం.అటువంటిది 8 ఎంపీ సీట్లలోను, 12 ఎంపీ సీట్లలోను బిజెపి కచ్చితంగా గెలిచే అవకాశాలు లేవనే తెలుస్తుంది. పైగా ప్రతిపాదన సీట్లలో టీడీపీ కి అత్యంత కీలకమైన స్థానాలు పక్కా గా గెలిచే సీట్లు ఉండడం గమనార్హం.. ఈ ప్రతిపాదన నిజానికి బీజేపీ నుండి వచ్చినట్లయితే టిడిపి గెలిచే సీట్లను బిజెపి తీసుకొని అక్కడ వైసిపి గెలుపుకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉన్నట్లు రాజకీయ మేధావులు చెబుతున్నారు. బిజెపికే అన్ని సీట్లు కేటాయిస్తే రాష్ట్రంలో టిడిపి, వైసిపి తర్వాత బాగా పాపులర్ అయిన జనసేన పార్టీ కి మరి ఎన్ని సీట్లను కేటాయించాలని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని టిడిపి, జనసేన ఒక మాట మీద ఉన్నాయి. తమతో బిజెపిని కలుపుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. కానీ బిజెపి నాయకత్వం అటు వైసీపీకి సహకరిస్తూ ఇటు టిడిపి, జనసేనకు దగ్గరగా ఉన్నామని చెబుతూ డబల్ గేమ్ ఆడుతుందని బిజెపి మైండ్ గేమ్ లో భాగంగానే సోషల్ మీడియాలోను, మీడియా వాట్సప్ గ్రూపులలోను టిడిపి, బిజెపి పొత్తు కుదిరిందని, సీట్ల కేటాయింపు పై ఒక స్పష్టత వచ్చిందని, పలానా సీట్లు సీట్లు బిజెపి కి కేటాయించడం జరిగిందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నది కొందరు రాజకీయ విశ్లేషకులమాట.. పొత్తు పేరుతో పార్టీలు వేస్తున్న రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని అధికారిక ప్రకటన వచ్చేవరకు దేన్నీ విశ్వసించవద్దని పార్టీలు కేడర్ కి చెప్పుకుంటున్నాయి..
previous post