బిజెపి ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల డబ్బును నియంత్రించడానికి హుటాహుటిన పాత నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించింది. ప్రకటించిన అనంతరం నోట్లన్నీ రద్దు చేసింది. ఆ నోట్లను మార్చుకోవడానికి కొంత సమయాన్ని కూడా ఇచ్చింది. ఆ సమయంలో జనాలందరూ బ్యాంకుల మీద ఎగబడ్డారు. పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకునేందుకు క్యూలు కట్టారు.అప్పటికి పెద్ద నోటైనా వెయ్య రూపాయల స్థానంలో కొత్తగా రెండువేల నోటును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పట్లో ఈ నోటు వ్యాహరంపై పెద్ద చర్చ జరిగింది. పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని నిలవ చేయడానికి పెద్ద నోట్లు ఉపయోగపడతాయని అందుకే బిజెపి ప్రభుత్వం రూ. 2000 నోటు తీసుకువచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో 2016న కాకతాళీయంగా విజయ అంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా విడుదల అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు కు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో పాత నోట్ల రద్దు వ్యవహారం జరుగగా ఇప్పుడు తాజాగా 2003లో అదే కేంద్ర బిజెపి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూ. 2000 నోటును రద్దు చేసింది. విచిత్రం ఏంటంటే బిచ్చగాడు 2 సినిమా రిలీజ్ సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం విశేషం. నోట్ల రద్దు వ్యవహారానికి బిచ్చగాడు సినిమాల రిలీజ్ కు తెలియదు ఒక కనెక్షన్ ఉండటంతో నెటిజన్లు దీనిపై ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి బిచ్చగాడు పార్ట్ 3 సినిమా తీయవద్దంటూ విజయ్ ఆంటోనీ ని వేడుకుంటూ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బిచ్చగాడు పార్ట్ 3 రిలీజ్ అయితే దేశంలో ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయో, ఇంకా విశేషాలు చూడవలసి వస్తుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
previous post
next post