జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. పదవులను ఆశించి పార్టీలోకి వచ్చే వారికి పార్టీ స్టాండ్ అనేది ఏంటో చెప్పేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలామంది హంగు ఆర్భాటాలు చేస్తూ తమకే సీట్లు కేటాయిస్తారని ఎవరికి వారు ప్రచారాలు చేసేసుకుంటున్నారని ఇటువంటి వారికి పార్టీ ఎప్పుడు ప్రాధాన్యతను ఇవ్వదని చెప్పేసారు. విశాఖ పర్యటన లో భాగంగా కార్పొరేటర్ కందుల నాగరాజు నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భం లో ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ పట్టిష్టత కు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేవారి కోసం, ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లకే పార్టీ పరంగా గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని క్లియర్ కట్ గా చెప్పేసారు. ఎవరికి సీట్లు కేటాయించాలన్నది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని కానీ ఈ లోపు ఎవరికివారు తమకే సీటు వస్తుందనే భావనతో హడావుడి చేస్తూ ప్రచారాలు మొదలు పెట్టేయడం సరికాదని హితవు పలికారు. విశాఖలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి సారించి పార్టీ తరపున ప్రజలతో కలిసి పోరాటం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎన్నికల కోసం హడావిడి చేస్తూ పార్టీ విధి విధానాలను పాటించకపోతే వారిని పార్టీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రూపు రాజకీయాలను, విభేదాలను పక్కన పెట్టి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, పార్టీ విధి విధానాలను పాటిస్తూ జనసేన పార్టీని ప్రజలలోకి మరింతగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు.
previous post
next post