వచ్చే ఎన్నికలలో టిడిపి- జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జోరందుకున్నప్పటికి ఈ విషయంపై ఇరు పార్టీ నేతలు మాత్రం ఎవరు పెదవిప్పడం లేదు. మీడియా అడిగినప్పుడల్లా కప్పదాటు సమాధానం చెబుతూ తప్పించుకునే వాళ్ళు. చంద్రబాబు నాయుడు- పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీ అనంతరం పోత్తులపై మరింత స్పష్టత వచ్చిందన్న ప్రచారం సాగుతున్నప్పటికి క్లారిటీ మాత్రం ఎవ్వరూ ఇవ్వని నేపథ్యంలో జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం పొత్తులపై ఒక క్లారిటీ వుందన్న మాట మాత్రం స్పష్టం చేసారు.. పొత్తు అనేది ఉంటుందనేది నేరుగా చెప్పకుండా ముందుముందు ఇరు పార్టీల మధ్య జరిగే చర్చల తర్వాత ఈ విషయంపై ఒక స్పష్టత అయితే వస్తుందన్నది ఆయన సారాంశం. ఒకపక్క బిజెపి నాయకత్వం జనసేన టిడిపి వైపు వెళ్లకుండా ఉండేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోపక్క గతంలో కలిసి వెళ్లినట్లు బిజెపి, టిడిపి, జనసేన మళ్లీ కలిసి ఎందుకు వెళ్ళకూడదనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఢిల్లీ పెద్దల తో జరిగిన మంతనాలలో ఇదే విషయాన్ని ఆయన సుచాయగా స్పష్టం చేయగ పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పై ఢిల్లీ పెద్దలు ఏ విధమైన సమాధానం చెప్పకుండా, భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బిజెపిని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టినట్లు ఢిల్లీ నాయకత్వం పవన్ కళ్యాణ్ కు వివరించింది. ఢిల్లీ పెద్దల సమాధానంతో సంతృప్తి పడని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో టిడిపి కలిసి వెళ్తేనే వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టిడిపి- జనసేన నాయకులు మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల సారాంశం అన్నది పూర్తిగా బయటికి రానప్పటికీ వచ్చే ఎన్నికలలో కలిసి వెళ్లేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మొన్న పవన్ కళ్యాణ్- చంద్రబాబు నాయుడు భేటీతో కూడా ఒక స్పష్టత వచ్చింది. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ కూడా మీడియా వాళ్ళు పొత్తులపై అడిగిన ప్రశ్నలకు పొత్తు ఉండదనే విషయం ఎక్కడ చెప్పలేదు. ఇదివరకు రెండు పార్టీల మధ్య సమావేశాలు జరిగినట్లు చెప్పారు. రెండు పార్టీల అధినేతల మధ్య జరిగిన సమావేశం కూడా తెలియజేశారు. భవిష్యత్తులో కూడా అంతర్గతంగా మరికొన్ని సమావేశాలు జరిగే అవకాశం ఉందని కూడా నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడం టిడిపి- జనసేన పార్టీల లక్ష్యమని వివరించారు. ఈ దిశగానే ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జనసేన- టిడిపి కలిసికట్టుగా వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చనేది నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆయన మాటలను బట్టి చూస్తే పొత్తులపై ఇరు పార్టీల మధ్య ఒక అవగాహన అయితే ఉందని స్పష్టమవుతుంది. మలిదశలో జరిగే ఇరు పార్టీల సమావేశాల అనంతరం ఒక క్లారిటీ కి వచ్చి అధికారుకంగా పొత్తులపై ప్రకటన చేసే అవకాశం ఉందన్నది తెలుస్తుంది. టిడిపి- జనసేన మధ్య బలపడుతున్న మైత్రి పై మరపక్క బీజేపీ నాయకత్వం నిశితంగా గమనిస్తుంది. తాము ఇప్పటికే కూడా జనసేన తోనే కలిసి ఉన్నామని బిజెపి నేతలు చెబుతున్నప్పటికి టిడిపితో కలిసి వెళ్లడం మాత్రం నచ్చదని ఇప్పటికే బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు.. ఇప్పుడు తమ మిత్రుడని భావిస్తున్న పవన్ కళ్యాణ్ టిడిపి తో మైత్రి కోసం ప్రయత్నించడంపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. ఇక ఎన్నికలకు చాలా సమయం ఉన్న దృష్ట్యా టిడిపి- జనసేన మైత్రి పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా తటస్థంగా ఉండి అవకాశం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు తన వాయిస్ ని వినిపించాలని బిజెపి నాయకత్వం భావిస్తుంది.
previous post
next post