ఇకపై ట్విట్టర్ కనిపించిందని సాక్షాత్తు ఆ సంస్థ సీఈఓ అలెన్ మస్క్ చేసిన ట్వీట్ పెద్ద కలకలమే రేపింది.. ప్రస్తుతం ట్విట్టర్ అనే స్వతంత్ర కంపెనీ ఇక మనుగడలో లేదని ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్ లో ట్విట్టర్ ను విలీనం చేస్తున్నట్లు ఒక కేసు విషయమై కోర్టు ఇచ్చిన సమాచారం లో దీన్ని పేర్కొవడమే కాకుండా ఎక్స్(X) అన్న ఒకే ఒక అక్షరాన్ని ఎలన్ మాస్క్ ట్వీట్ చేశారు. కొనుగోలు విలీనం సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు కాలింగ్, చెల్లింపులు, చాట్, ఇలా అన్ని కార్యకలాపాలని ఒక యాప్లో వుండే విధంగా ఎవ్రీథింగ్ యాప్”ను రూపొందిస్తున్నట్లు చెపుతున్నారు. ఈ విలీన ప్రక్రియ గత మార్చి లొనే జరిగిందని కోర్టు కి తెలిపినట్లు సమాచారం. ఎక్స్ అక్షరం తోనే దాదాపు అన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్న మస్క్ 1999లో ఎక్స్ అనే పేరు తో ఒక ఆన్లైన్ బ్యాంకు ఏర్పాటు చేశారు అయితే తర్వాత పేపాల్ లో దాన్ని కూడా విలీనం చేశారు ఆ తరువాత ఎక్స్ డాట్ కామ్ అనే డొమైన్ ను కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు ట్విట్టర్ ను ఎక్స్ యాప్ తో కలిపి ఒక సూపర్ యాప్ గా రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు 44 మిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను గతంలో కొనుగోలు చేసిన మస్క్ ఎక్స్ యాప్ తన దీర్ఘకాల ప్రణాళిక అని ఈ రెండు కలవడం వలన గణనీయ ఫలితాలు అందుకోవచ్చని గతంలోనే ట్వీట్ చేశారు. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన దగ్గర నుంచి సంస్థ పట్ల , వెరిఫైడ్ బ్లూ టిక్ పట్ల ఉద్యోగులు కానీ యూజర్లు గాని అంత సంతృప్తి గా లేరని అనేక సర్వేలు నివేదికలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వార్త , కొత్త యాప్ ఏ మేరకు సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.